Mahesh Babu’s ‘Nijam’ : మహేష్ బాబు ‘నిజం’ చిత్రం ఆరోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఈ చిత్రాన్ని 'ఒక్కడు' కంటే ముందుగా ప్రారంభించి ఉంటె కచ్చితంగా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదని, ఇప్పటికీ ఈ సినిమా ఫ్లాప్ అయితే కాలేదని, ఆరోజుల్లోనే ఈ చిత్రం 10 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిందని తేజ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

Written By: NARESH, Updated On : May 24, 2023 10:21 pm

Mahesh Babu's 'Nijam'

Follow us on

Mahesh Babu’s ‘Nijam’ : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో డైరెక్టర్ తేజ తో చేసిన ‘నిజం’ అనే సినిమా కూడా ఉంది. ‘ఒక్కడు’ వంటి సెన్సషనల్ హిట్ తర్వాత మహేష్ బాబు, అలాగే ‘చిత్రం’ , ‘నువ్వు నేను’ మరియు ‘జయం’ లాంటి వరుస హ్యాట్రిక్ హిట్స్ తర్వాత తేజ, ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడం తో ఆ రోజుల్లో ఈ చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడం లో మొదటి ఆట నుండే విఫలం అయ్యింది. కానీ మహేష్ బాబు ని మాత్రం నటుడిగా వేరే లెవెల్ లో నిలబెట్టిన సినిమాగా ఈ ‘నిజం’ నిల్చింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’ చిత్రం తో మహేష్ కి వచ్చిన ఇమేజి వల్లే అని తేజ పలు సందర్భాలలో తెలిపాడు.

\ఎప్పుడైతే తేజ మహేష్ బాబు హీరోగా నటించిన ‘బాబీ’ సినిమా చూశాడో, అప్పుడు ఈ నిజం స్క్రిప్ట్ ని మహేష్ తో చెయ్యాలనుకున్నాడట. అప్పటికీ ‘ఒక్కడు’ చిత్రం విడుదల కూడా కాలేదట, ‘ఒక్కడు’ చిత్రం కంటే ముందుగా ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల కారణంగా ‘ఒక్కడు’ చిత్రం తర్వాత ప్రారంభం చెయ్యాల్సి వచ్చిందట.

ఒకవేళ ఈ చిత్రాన్ని ‘ఒక్కడు’ కంటే ముందుగా ప్రారంభించి ఉంటె కచ్చితంగా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదని, ఇప్పటికీ ఈ సినిమా ఫ్లాప్ అయితే కాలేదని, ఆరోజుల్లోనే ఈ చిత్రం 10 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిందని తేజ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన దర్శకత్వం లో రానా తమ్ముడు అభిరామ్ ని హీరో గా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే నెల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా తేజ వరుసగా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, ఆ ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన మాటలే ఇవి.