Homeఎంటర్టైన్మెంట్Ravi Teja Career Revival After Flops: వరుస ప్లాప్ లతో రవితేజ కి తత్వం...

Ravi Teja Career Revival After Flops: వరుస ప్లాప్ లతో రవితేజ కి తత్వం బోధపడిందా..?

Ravi Teja Career Revival After Flops: సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాల్లో నటించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది అందరి వల్ల సాధ్యం కాదు. కొంతమంది ఇండస్ట్రీ వచ్చి ప్రయత్నాలు చేసినప్పటికి అవకాశాలు రాకపోవడంతో ఇక్కడ ఉండి కష్టాలు భరించే కంటే వేరే పని చేసుకుంది బెటర్ అనుకుంటూ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇండస్ట్రీని శ్వాసగా, ధ్యాసగా పెట్టుకొని దానికోసమే బ్రతుకుతున్నారు. వాళ్లకి ఎప్పటికైనా ఒక మంచి సక్సెస్ వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. దానివల్ల వాళ్ళు ఇండస్ట్రీలో ఏదో ఒకరోజు సక్సెస్ ఫుల్ యాక్టర్స్ గా మారుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రవితేజ లాంటి హీరో సైతం ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా మారాడు… గత కొంతకాలం నుంచి రవితేజ సైతం ఫ్లాప్ లను మూట గట్టుకుంటున్నాడు.

కారణం ఏదైనా కథతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వరుస సినిమాలను చేస్తుండడం వల్ల ఆయన కొంతవరకు డీలాపడిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇక దీంతో పాటుగా మరికొన్ని డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటున్నాడు.

ఇక అలాగే తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా కొంతవరకు తగ్గినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు 20 కోట్లకు పైన రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిన రవితేజ ప్రస్తుతం 10 కోట్లు తీసుకొని సినిమాలు చేస్తున్నాడు… ఇలా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగితే ఎప్పటికైనా రవితేజ మరోసారి తన సత్తా చాటుకున్న వాడవుతాడు…

లేకపోతే మాత్రం ఆయన కెరీర్ అనేది చాలా తొందరగా ముగిసిపోయే ప్రమాదం కూడా ఉంది. మొత్తానికైతే రవితేజకు తత్వం బోధపడినట్టుంది ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎలాంటి సినిమాలు చేస్తే మళ్లీ మనం ఫామ్ లోకి రావచ్చు అనే ఉద్దేశ్యంతో తనను తాను మార్చుకునే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది… అందుకోసమే డిఫరెంట్ సబ్జెక్టులను ట్రై చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular