Homeఎంటర్టైన్మెంట్Varalaxmi Sarathkumar Controversy With Writer: ఆ స్టార్ రైటర్ ను మోసం చేసిన వరలక్ష్మీ...

Varalaxmi Sarathkumar Controversy With Writer: ఆ స్టార్ రైటర్ ను మోసం చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్…అసలేం జరిగిందంటే..?

Varalaxmi Sarathkumar Controversy With Writer: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు రైటర్లను మోసం చేస్తున్నారనే వార్తలైతే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. నిజానికి ఒకప్పుడు ఇది విపరీతంగా జరిగేది. వాళ్ళ కథలను, మాటలను వాడుకొని వాళ్ళ పేర్లు వేయకపోవడంతో విసిగిపోయిన చాలామంది రచయితలు దర్శకులుగా మారారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఒక స్టార్ రైటర్ సైతం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరికి మాటలను రాసిన సాయి మాధవ్ బుర్ర […]

Varalaxmi Sarathkumar Controversy With Writer: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు రైటర్లను మోసం చేస్తున్నారనే వార్తలైతే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. నిజానికి ఒకప్పుడు ఇది విపరీతంగా జరిగేది. వాళ్ళ కథలను, మాటలను వాడుకొని వాళ్ళ పేర్లు వేయకపోవడంతో విసిగిపోయిన చాలామంది రచయితలు దర్శకులుగా మారారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఒక స్టార్ రైటర్ సైతం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరికి మాటలను రాసిన సాయి మాధవ్ బుర్ర వరలక్ష్మి శరత్ కుమార్ ను మెయిన్ లీడ్ లో పెట్టి ‘సరస్వతి’ అనే సినిమాకి కథ మాటలు స్క్రీన్ ప్లే ని అందించాడు.

ఇక దర్శకత్వం కూడా తనే చేశాడు. కాకపోతే ఈ మూవీకి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రొడ్యూసర్ కావడం వల్ల సాయి మాధవ్ బుర్ర అడిగినవన్నీ తను సమకూర్చడం లేదట. వరలక్ష్మీ కి నచ్చినట్టుగానే సినిమా చేయాలని చెబుతూ వస్తుందట. తనకు నచ్చిన టెక్నీషియన్స్ ను తీసుకుందట. దీంతో ఈ సినిమా తనకు వర్కౌట్ కాదనే ఉద్దేశ్యంతో సాయి మాధవ్ బుర్ర ఈ సినిమా నుంచి పక్కకు వచ్చినట్టుగా తెలుస్తుంది.

సరస్వతి సినిమాని వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక ఎంటైర్ ఈ సినిమా విషయంలో సాయి మాధవ బుర్రకు సంబంధించిన టైటిల్ ను ఎక్కడ వాడటం లేదు. అలాగే తన పేరు కూడా ప్రస్తావించడం లేదు. నిజానికి సాయి మాధవ్ బుర్ర ఈ కథ మీద చాలా హోప్స్ పెట్టుకొని రాసుకున్నాడు.

కానీ చివరికి తన పేరు కూడా వాడడం లేదంటూ తను తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ కూడా పూర్తిగా ఇవ్వలేదనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ విషయం మీద సాయి మాధవ్ బుర్ర ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper