https://oktelugu.com/

‘కేజీయఫ్‌2’లో నేను పవర్ ఫుల్‌ – రవీనా టాండన్

బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌ అంటే.. ఇప్పటికీ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. వయసు పెరిగిన తనలోని ఆ బిగివును పోకుండా పర్ఫెక్ట్ ఫిజిక్ తో మొత్తానికి తనను తానూ సెక్సీగా మెయింటైన్ చేస్తూ వస్తోంది రవీనా. ఇక ‘కేజీయఫ్‌2’లో రవీనా ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. అయితే తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీనా మాట్లాడుతూ.. ‘నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథ చెప్పిన వెంటనే ఆ […]

Written By:
  • admin
  • , Updated On : January 8, 2021 / 03:44 PM IST
    Follow us on


    బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌ అంటే.. ఇప్పటికీ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. వయసు పెరిగిన తనలోని ఆ బిగివును పోకుండా పర్ఫెక్ట్ ఫిజిక్ తో మొత్తానికి తనను తానూ సెక్సీగా మెయింటైన్ చేస్తూ వస్తోంది రవీనా. ఇక ‘కేజీయఫ్‌2’లో రవీనా ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. అయితే తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీనా మాట్లాడుతూ.. ‘నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథ చెప్పిన వెంటనే ఆ సన్నివేశాలన్నీ నా ముందు కదలాడాయి. అంత అద్భుతంగా ప్రశాంత్ నాకు కథను చెప్పారు.

    Also Read:  వాళ్లకి వ్యాపారాన్ని ఇవ్వొద్దు.. ‘పవన్’ మాజీ సతీమణి ఫైర్ !

    ఇక రాకింగ్ స్టార్ యశ్‌తో తొలిసారి పనిచేయడం ఎలా అనిపించింది అంటే.. రవీనా టాండన్‌ మాటల్లో చెప్పలేను అంటుంది. యశ్‌ మంచి వ్యక్తి మాత్రమే కాదు, అద్భుతమైన ప్రతిభావంతుడు కూడా. చక్కగా మాట్లాడతాడు. తనతో పనిచేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను అని చెప్పుకొచ్చింది. అలాగే కేజీయఫ్‌2’లో తన పాత్ర గురించి చెబుతూ.. సినిమాలో నాది పవర్‌ఫుల్‌ పాత్ర. రమికాసేన్‌గా కనిపిస్తాను. ఈ పాత్రను చేసేటప్పుడు నాకే నేను నమ్మేవిదంగా లేను. దర్శకుడు ఈ పాత్రను కాస్త వైవిధ్యంగా తీర్చిదిద్దారు.

    Also Read: ‘వకీల్ సాబ్’ టీజర్ కంటెంట్ లీక్.. అదిరిపోయింది !

    అలాగే ఒక సన్నివేశంలో ప్రవర్తించినట్లు మరో సన్నివేశాల్లో ఉండను. రమికాసేన్‌ ఎందకలా చేస్తోందో ఎవరూ ఊహించలేరు కూడా. అంతకు మించి నేనేమీ చెప్పలేను అంటుంది రవీనా. ‘కేజీయఫ్‌2’ కోసం సినీ అభిమానులు ఎలా ఎదురు చూస్తున్నారో.. తన అభిమానులు కూడా అలాగే ఎదురు చూస్తున్నారని.. వారంతా తల ఎత్తుకునేలా తన పాత్ర నిలుస్తోందని చెబుతుంది. తన కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర అవుతుందట. ఈ భారీ బడ్జెట్‌ సినిమాలో సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావురమేశ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ‘కేజీయఫ్‌2’ టీజర్ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్