బర్డ్‌ ఫ్లూ.. భయం అస్సలే వద్దు

మొన్నటి వరకు కరోనా భయం.. నిన్న కొత్త స్ట్రెయిన్‌.. ఇప్పుడు బర్డ్‌ ఫ్లూ. ఒక భయం నుంచి ప్రజలు కోలుకోక ముందే ఇంకో భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే కరోనా బారి నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఎంతో మంది ఎన్నో విధాలా నష్టపోయారు. ఇక ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లోకి పాకిన బర్డ్‌ ఫ్లూ అందరినీ వెంటాడుతోంది. Also Read: వాహనదారులకు తీపికబురు.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు..? ఇక కోడికి మరోసారి కష్టమొచ్చింది. మొన్నటివరకు కరోనా నేపథ్యంలో […]

Written By: Srinivas, Updated On : January 8, 2021 3:32 pm
Follow us on


మొన్నటి వరకు కరోనా భయం.. నిన్న కొత్త స్ట్రెయిన్‌.. ఇప్పుడు బర్డ్‌ ఫ్లూ. ఒక భయం నుంచి ప్రజలు కోలుకోక ముందే ఇంకో భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే కరోనా బారి నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఎంతో మంది ఎన్నో విధాలా నష్టపోయారు. ఇక ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లోకి పాకిన బర్డ్‌ ఫ్లూ అందరినీ వెంటాడుతోంది.

Also Read: వాహనదారులకు తీపికబురు.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు..?

ఇక కోడికి మరోసారి కష్టమొచ్చింది. మొన్నటివరకు కరోనా నేపథ్యంలో చాలా మంది చికెన్‌ తినడం మానేశారు. ఇప్పుడు బర్డ్‌ ఫ్లూ నేపథ్యంలో ఇప్పటికే చాలాచోట్ల చికెన్‌ తినడం మానేశారు. దానికి తోడు వ‌ల‌స ప‌క్షులు చ‌నిపోతున్నాయ‌నే వార్తలు, ఆ పై నాటు కోళ్లు కూడా ఎక్కడికక్కడ చనిపోతూ ఉండ‌టం ఆందోళ‌న రేపుతోంది. ప‌ల్లెల్లో నాటుకోళ్లు ఇప్పుడు విప‌రీతంగా చ‌నిపోతున్నాయి.

అయితే.. తాజాగా వ్యాప్తి చెందుతున్న బర్డ్‌ ఫ్లూ కొత్తదేమీ కాదు. గతంలోనే వచ్చి పోయింది. అయితే.. ఇప్పుడు కరోనా భయం వెంటాడుతుండడంతోఈ బర్డ్‌ ఫ్లూ మరింత భయపెడుతోంది. ఇది క‌రోనా అంత తీవ్రమైనది కాదనే విషయం కూడా అందరూ గమనించాలి. మ‌నిషి త‌న‌కు తెలియ‌కుండానే ఇమ్యూనిటీతో జ‌యించ‌గ‌ల ఎన్నో వ్యాధుల్లాంటిదే బ‌ర్డ్ ఫ్లూ అని నిపుణులు చెబుతూ ఉన్నారు.

Also Read: పట్టు వీడని రైతులు.. మెట్టు దిగని కేంద్రం

దీన్ని కూడా సీజ‌న‌ల్ ఫ్లూ మాదిరిగా తీసుకుని చికిత్స తీసుకుంటే తేలిక‌గానే బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చని సూచిస్తున్నారు. అనారోగ్యం బారిన ప‌డితే మాత్రం జాగ్రత్తలు త‌ప్పకుండా తీసుకోవాలంటున్నారు. ఇక చికెన్ తిన‌డం కూడా పూర్తిగా మానేయాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. కుకింగ్ స‌రిగా చేసుకుంటే సరిపోతుందట. ఉడికీఉడ‌క‌ని రీతిలో మాత్రం చికెన్ తీసుకోవ‌ద్దని సూచిస్తున్నారు. కోళ్లకు స‌హ‌జంగానే జ‌బ్బులు వ‌స్తుంటాయి. వాటిల్లో కొక్కెర అని రోగం కూడా ఒక‌టి. దాని ఫ‌లిత‌మే కోళ్లు చ‌నిపోతూ ఉండ‌టం అనేది కూడా కావచ్చు. అందుకే.. ప్రజలకు ఈ బర్డ్‌ ఫ్లూ భయం అస్సలు అక్కర్లేదని వారు సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్