https://oktelugu.com/

‘కేజీఎఫ్-2’ టీజర్.. ప్రపంచ రికార్డులు బద్దలు !

యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో రాకింగ్ స్టార్ యశ్ – ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్ చాప్టర్- 1` సీక్వెల్ కూడా ఒకటి. `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి, నేషనల్ రేంజ్ లో సాధించిన కలెక్షన్స్ గురించి తెలిసిందే. అయితే, ‘కేజీఎఫ్’ టీం ఇచ్చిన సడెన్ సర్ప్రైజ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. టీజర్ రిలీజైన 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల (2.5 కోట్లు) వ్యూస్ మార్కును […]

Written By:
  • admin
  • , Updated On : January 8, 2021 / 03:52 PM IST
    Follow us on


    యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో రాకింగ్ స్టార్ యశ్ – ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్ చాప్టర్- 1` సీక్వెల్ కూడా ఒకటి. `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాల గురించి, నేషనల్ రేంజ్ లో సాధించిన కలెక్షన్స్ గురించి తెలిసిందే. అయితే, ‘కేజీఎఫ్’ టీం ఇచ్చిన సడెన్ సర్ప్రైజ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది. టీజర్ రిలీజైన 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల (2.5 కోట్లు) వ్యూస్ మార్కును దాటేసి మొత్తానికి సరికొత్త రికార్డ్స్ ను సృష్టించింది.

    Also Read: ‘కేజీయఫ్‌2’లో నేను పవర్ ఫుల్‌ – రవీనా టాండన్

    ఇక శుక్రవారం యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ముహూర్తం పెట్టి టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినా.. ఆ లోపే టీజర్ లీక్ కావడంతో అనుకున్న దానికంటే 12 గంటల ముందే టీజర్ ‌‌ను రిలీజ్ చేశారు. అయితే, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి యూట్యూబ్‌లో ‘కేజీఎఫ్-2’ టీజర్ అన్ని భాషల్లో కలిపి మొత్తం 3 కోట్లకు పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఇక ఈ టీజర్ లైక్స్ విషయంలో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్, 2 మిలియన్ లైక్స్ సంపాదించిన టీజర్ ‌గా కూడా ఇది ప్రపంచ రికార్డులు నెలకొల్పిందంటే.. ప్రేక్షకులకు టీజర్ ఎంతలా నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.

    Also Read: వాళ్లకి వ్యాపారాన్ని ఇవ్వొద్దు.. ‘పవన్’ మాజీ సతీమణి ఫైర్ !

    నిజానికి ఈ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయినప్పుడు, ముందు అందరూ లైట్ తీసుకున్నారు. చాలామందికి అసలు సినిమానే అర్ధం కాలేదు. అయితే, ఆ తరువాత ఈ సినిమాలోని గొప్పతనాన్ని అర్ధం చేసుకున్న ఆడియన్స్.. థియేటర్లలోనే కాక.. ఆ తరువాత అమేజాన్ ప్రైమ్‌లోనూ వివిధ భాషల ప్రేక్షకులు ఈ సినిమాని విరగబడి చూశారు. ఇక అప్పట్నుంచి ‘కేజీఎఫ్-2’ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని దర్శకుడు ప్రశాంత్ ఇంకా ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్