Rashmika Rejected Movies: సినిమా రంగంలో అంటేనే టైమింగ్స్ తో కూడుకున్నది. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలను మరో హీరో చేస్తుంటాడు. హీరోయిన్ల విషయం కూడా అంతే. చాలామంది హీరోయిన్లు తాము ముందు ఒప్పుకున్న కొన్ని సినిమాల కారణంగా అద్భుతమైన కథలను వదులుకుంటారు. ఇక అవి గనక పెద్ద హిట్ అయితే మాత్రం.. మంచి ఛాన్సులు మిస్ చేసుకున్నామే అని బాధపడతారు. ఇలా స్టార్ హీరోయిన్ రష్మిక కూడా కొన్ని సినిమాలను వదులకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కన్నడలో సూపర్ హిట్ కొట్టిన కిరీక్ పార్టీని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అయితే ఇందులో హీరోగా కార్తీన్ ఆర్యన్‌తో చేస్తుండగా.. హీరోయిన్ గా రష్మికనే అడిగారంట. కానీ ఆమె నో చెప్పింది.

తెలుగులో సంచలన విజయం సాధించి విమర్శలకు ప్రశంసలు అందుకున్న జెర్సీ మూవీని బాలీవుడ్ లో కూడా జెర్సీ పేరుతోనే రీమేక్ చేశారు. ఈ రీమేక్ మూవీలో షాహిద్ కపూర్ సరసన ముందుగా రష్మికను చేయాలని కోరారు. కానీ ఆమె రిజెక్ట్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల్ కలిసి నటిస్తున్న ఆచార్య మూవీలో రామ్ చరణ్ సరసన ముందుగా రష్మికను అనుకున్నారంట. కానీ ఆమె వద్దని చెప్పేయడంతో పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసింది.

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సెన్సేషనల్ మూవీ మాస్టర్ లో ముందుగా రష్మికకు ఛాన్స్ వచ్చింది. కానీ పాత్ర చిన్నగా ఉండటంతో వద్దని చెప్పిందంట. దాంతో మాళవిక్ మోహనన్ చేసింది.

ఇప్పుడు భారీ అంచనాల నడుమ వస్తున్న విజయ్ మూవీ బీస్ట్ లో కూడా ముందుగా రష్మికను అడిగారంట. కానీ వేరే కారణాల వల్ల ఆమె నో చెప్పిందంట. దీంతో ఈ అవకాశాన్ని కూడా పూజా హెగ్దే తన ఖాతాలో వేసుకుంది.

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అంటే సుందరానికీ మూవీలో ముందుగా రష్మికను అడిగారంట. కానీ ఆమె చాలా బిజీ అయిపోవడంతో ఈ మూవీని వద్దని చెప్పిందంట. దీంతో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌ను తీసుకున్నారు.

తెలుగులో సెన్సేషనల్ హిట్ కొట్టిన బంగార్రాజు మూవీలో నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించారు. ఇందులో నాగచైతన్య సరసన ముందుగా రష్మికను అడిగారంట. కానీ ఆమె కుదరదని చెప్పడంతో ఆ బంపర్ ఛాన్స్ కృతి శెట్టిని వరించింది.

Also Read: ఎద అందాలతో మంటలు రేపిన ఈషారెబ్బ.. గ్లామర్ డోస్ పెంచేసిందిగా..
ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ ప్రాజెక్ట్ గా వస్తున్న రామ్ చరణ్, శంకర్ మూవీలో ముందుగా రష్మికను అనుకున్నారంట. ఈ సినిమా చేయాలని రష్మిక కూడా ఇంట్రెస్ట్ చూపించినా.. చివరకు డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో ఆ లక్కీ ఛాన్స్ కియారా అద్వానీ చేతిలో పడిపోయింది.
తెలుగులో వచ్చిన మహా సముద్రం మూవీలో మహా పాత్ర కోసం రష్మికను అడిగారంట. కానీ ఆమె నో చెప్పింది. ఇక వీటితో పాటు సంజయ్ లీలా భన్సాలీతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను వదులుకుందంట. ఇన్ని పెద్ద ఛాన్సులు వస్తున్నా కూడా.. రష్మిక మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది.

Also Read: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటుడి కన్నుమూత..!
[…] Rajinikanth Basha movie: ఒక్క సినిమా చాలు ఒక నటుడిని స్టార్ హీరో చేయడానికి. రజినీకాంత్ జీవితంలో కూడా అలాంటి సినిమా ఒకటుంది. అదే బాషా మూవీ. ఈ మూవీతో రజినీకాంత్ ఏకంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు. అప్పటి వరకు ఉన్న అన్ని సినిమా రికార్డులను బద్దలు కొట్టి ఆల్ టైమ్ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పటికీ ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇందులో రజినీకాంత్ నటవిశ్వరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే. […]
[…] Rebel Star Prabhas: ప్రభాస్ మంచి తనమే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలందుకునేలా చేసింది. ప్రభాస్ వ్యక్తిత్వమే అతన్ని పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ప్రభాస్ కెరీర్‌లో విజయవంతమైన చిత్రాలున్నా.. అలాగే భారీ ఫ్లాపులు కూడా ఉన్నాయి. కానీ.. ఇది ప్లాప్ అవుతుంది అని తెలిసి కూడా ప్రభాస్ ఆ సినిమా చేయడం కచ్చితంగా గొప్ప విషయం. ఈ కథ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంది అని తెలిసి తెలిసి.. తన కెరీర్ ను ప్రభాస్ రిస్క్ లో పెట్టిన విధానం ప్రభాస్ మంచితనానికి నిదర్శనం. […]