Rashmika Mandanna Shirt: హీరో విజయ్ దేవరకొండ-రష్మిక మందాన ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం చాలా కాలంగా ఉంది వీరిద్దరూ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో జతకట్టారు. లిప్ లాక్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటించారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయింది రష్మిక మందాన. విజయ్ దేవరకొండ చిన్న చిన్న వేడుకలకు కూడా రష్మిక మందాన హాజరవుతుంది. ఆ ఇంట్లో జరిగే వేడుకల్లో రష్మిక మందాన మాత్రమే కనిపిస్తుంది. పరిశ్రమకు చెందిన విజయ్ దేవరకొండ క్లోజ్ ఫ్రెండ్స్ కి కూడా ఆహ్వానం ఉండదు.
అలాగే విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి విహారాలకు వెళతారు. మీడియాకు తెలిసి రెండుసార్లు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. విడివిడిగా అక్కడకు వెళ్లి ఒకే రూమ్ లో మకాం వేస్తారు. ఇందుకు ఆధారాలు కూడా లభించాయి. మీరు కలిసే టూర్స్ కి వెళుతున్నారు కదా? అని రష్మికను అడిగితే అందులో తప్పేముంది అంటుంది. విజయ్ దేవరకొండ నా ఫ్రెండ్, ఫ్రెండ్ తో టూర్స్ కి వెళితే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తుంది.
ఘాడమైన ప్రేమలో ఉన్న ఈ జంట ఓపెన్ కావడం లేదనే వాదన ఉంది. తాజాగా మరోసారి వీరి ప్రేమ వ్యవహారం చర్చకు వచ్చింది. విజయ్ దేవరకొండ గతంలో ధరించి షర్ట్ లో రష్మిక మందాన కనిపించింది. ఒకసారి విజయ్ దేవరకొండ బ్లూ కలర్ చెక్ షర్ట్ ధరించారు. అదే చొక్కాలో రష్మిక దర్శనమిచ్చారు. ఆయనకు ఫిట్ గా ఉండగా… రష్మికకు ఆ షర్ట్ లూజ్ గా ఉంది. కాబట్టి ఇది విజయ్ దేవరకొండ చొక్కానే, వీరు ఒకరి బట్టలు మరొకరు కూడా వాడుకుంటున్నారంటూ ప్రచారం మొదలైంది.
ఒకే షర్ట్ ధరించిన విజయ్ దేవరకొండ, రష్మిక ఫోటోలు బయటకు తీసి పోలుస్తున్నారు. ఇదిప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక కెరీర్ పరంగా ఇద్దరూ ఫుల్ బిజీ. రష్మిక పుష్ప 2, యానిమల్, రైన్ బో టైటిల్స్ తో మూడు చిత్రాలు చేస్తున్నారు. నితిన్ సినిమా నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండ నటించిన ఖుషి విడుదలకు సిద్ధంగా ఉంది. గౌతమ్ తిన్ననూరి, పరుశురాం దర్శకత్వంలో రెండు చిత్రాలు చేస్తున్నారు.