Trivikram- Pawan Kalyan: వేదికల్లో మాట్లాడటం అందరికీ రాదు. కొందరికైతే కనీసం నోరు పెగలదు. కొందరు మాత్రం అనర్గళంగా మాట్లాడతారు. ఆడియన్స్ ని కట్టిపడేస్తారు. అలాంటి వారిలో త్రివిక్రమ్ ఒకరు. ఈ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన మిత్రుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే వినాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ ఇచ్చే ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ ప్రతి సినిమా ఫంక్షన్ కి త్రివిక్రమ్ రావాలని డై హార్డ్ ఫ్యాన్స్ ఆశపడతారు. అయితే గత రెండు ప్రీ రిలీజ్ వేడుకలను ఆయన స్కిప్ చేశారు.
భీమ్లా నాయక్, బ్రో ప్రీ రిలీజ్ వేడుకల్లో త్రివిక్రమ్ కనిపించలేదు. చెప్పాలంటే ఈ రెండు చిత్రాలకు కర్త కర్మ క్రియ త్రివిక్రమ్. మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు సినిమాలు బాగా రావడం కోసం సాయశక్తులా ప్రయత్నం చేసిన వ్యక్తి. మరి ఆయన ఎందుకు రావడం లేదనే వాదన మొదలైంది. ప్రముఖంగా వినిపిస్తున్న వాదన బండ్ల గణేష్ తో వివాదం. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక సమయంలో బండ్ల గణేష్ త్రివిక్రమ్ పై అనుచిత కామెంట్స్ చేశాడు.
తాను భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తే త్రివిక్రమ్ డామినేట్ అయిపోతాడు. అందుకే నాకు ఆహ్వానం లేకుండా చేశాడంటూ ఆరోపణలు చేశారు. బండ్ల ఆరోపణలకు సంబంధించిన కాల్ రికార్డింగ్ ఒకటి వైరల్ అయ్యింది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ రాలేదు. బ్రో మూవీ విషయంలో త్రివిక్రమ్ పేరు మరింత గట్టిగా వినిపించింది , ఆయన కచ్చితంగా వస్తారని అందరూ భావించారు. పవన్ కళ్యాణ్ రావడం ఆలస్యం కాగా త్రివిక్రమ్ ఆయనతో పాటు వస్తారని వేచి చూశారు.
త్రివిక్రమ్ రాలేదు. బండ్ల గణేష్ వివాదం తర్వాత త్రివిక్రమ్ హర్ట్ అయ్యారని ఇకపై ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరుకారనే ప్రచారం జరుగుతుంది. కాగా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా బండ్ల గణేష్ కి ఆహ్వానం దక్కలేదు. బండ్ల గణేష్ రాలేదు. కారణాలు ఏవైనా త్రివిక్రమ్, బండ్ల గణేష్ బ్రో ప్రీ రిలీజ్ వేడుకకు రాకపోవడం ఫ్యాన్స్ లోటుగా భావిస్తున్నారు. కాగా పవన్ తో పనిచేస్తున్న హరీష్ శంకర్, క్రిష్ కూడా ఈ వేడుకను స్కిప్ చేశారు.