Rashmika Mandanna: క్యూట్ బ్యూటీ రష్మిక మందన్నా బాలీవుడ్ హీరోయిన్ గా బాగా పాపులర్ అవ్వాలని ఆశ పడుతుంది. దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ సినిమాల కోసం అందాల ప్రదర్శనకు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు. పాత్ర డిమాండ్ చేసినా చేయకపోయినా.. ఎలా కావాలి అంటే.. అలా కనిపిస్తాను అంటూ హిందీ మేకర్స్ కి ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. అందుకే, రష్మిక ఓ హాట్ ఫోటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది బాగా వైరల్ అవుతుంది.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని స్టోరీ చేస్తూ.. బ్రా మాత్రమే ధరించి అద్దం ముందర ఘాటు ఫోజులిచ్చింది రష్మిక. అందాలు చూపరులకు కనువిందు చేయడంతో మొత్తానికి ఈ ఫోటోకి విశేషమైన స్పందన వస్తోంది. ఇక ఈ ఘాటు ఫొటోను షేర్ చేస్తూ రష్మిక ఒక మెసేజ్ కూడా చేసింది. ఇంతకీ ఏమి మెసేజ్ చేసిందంటే.. ‘ఈ ఫోటోను షేర్ చేయొచ్చో లేదో నాకు నిజంగా తెలీదు. నాకు తెలుసు మీలో చాలా మందికి ఈ ఫోటో నచ్చకపోవచ్చు.
Also Read: SS Rajamouli Special Story: ‘రాజమౌళి..’ మనిషా ? ఎమోషనల్ మిషనా ?
అయినా, నేను ఈ ఫోటో ఎందుకు పోస్ట్ చేస్తున్నానో తెలుసా ? గోల్స్ అనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండాలని చెప్పాలని నా ఉద్దేశ్యం. ఎప్పుడూ వర్కవుట్ చేస్తూనే.. డైట్ ఫాలో అవ్వాలి. అలాగే మన ఆలోచనలు బాగుండాలి. అన్నిటికి మించి మనం మనలా ఉండాలి. అదే విధంగా మనం బాగా ఎంజాయ్ చేయాలి. అప్పుడే మనం రియలైజ్ అవుతాం’ అంటూ ఈ క్యూట్ బ్యూటీ చాలా రాసుకొచ్చింది.
రష్మిక నటించిన మొదటి హిందీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే, హిందీ దర్శక నిర్మాతలు ఈ బ్యూటీకి వరుస అవకాశాలు ఇస్తున్నారు. మరోపక్క రష్మిక కూడా హిందీ సినిమాల కోసం కాస్త ఫిజిక్ ను మార్చుకుంటుంది.

అలాగే ఆమె, తనలో హాట్ నెస్ ఎలివేట్ అయ్యేలా ఈ మధ్య ఫోటో షూట్ లు కూడా విచ్చలవిడిగా చేసుకుంటూ పోతూ ఉంది. ఇవన్నీ గమనించిన కొన్ని కంపెనీలు రష్మికతో యాడ్స్ ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
Also Read: RRR Movie Box Office Collection: ‘ఫస్ట్ డే’నే రికార్డుల బెండు తీసిన ‘ఆర్ఆర్ఆర్’