https://oktelugu.com/

క్రేజీ బ్యూటీ ‘రష్మిక’ క్రేజీ ప్లానింగ్ !

క్రేజీ బ్యూటీ ‘రష్మిక’ నాలుగేళ్ళ క్రితం అవకాశాల కోసం హైదరాబాద్ టు బెంగుళూరు ట్రిప్స్ వేసుకుంటూ ‘ఛలో’ అనే సినిమాని పట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దశ తిరిగింది. లక్కీగా మహేష్ సినిమా వచ్చి సూపర్ హిట్ అవ్వడం, బన్నీ పిలిచి అవకాశం ఇవ్వడం మొత్తానికి తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ అయిపొయింది. అందరూ రష్మిక చుట్టూ తిరిగే రేంజ్ కి వచ్చింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాట పట్టడం ఒక విధంగా […]

Written By:
  • admin
  • , Updated On : December 26, 2020 / 02:58 PM IST
    Follow us on


    క్రేజీ బ్యూటీ ‘రష్మిక’ నాలుగేళ్ళ క్రితం అవకాశాల కోసం హైదరాబాద్ టు బెంగుళూరు ట్రిప్స్ వేసుకుంటూ ‘ఛలో’ అనే సినిమాని పట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దశ తిరిగింది. లక్కీగా మహేష్ సినిమా వచ్చి సూపర్ హిట్ అవ్వడం, బన్నీ పిలిచి అవకాశం ఇవ్వడం మొత్తానికి తక్కువ టైంలోనే రష్మిక స్టార్ హీరోయిన్ అయిపొయింది. అందరూ రష్మిక చుట్టూ తిరిగే రేంజ్ కి వచ్చింది. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బాట పట్టడం ఒక విధంగా పెద్ద సర్ప్రైజ్. నిజానికి రష్మిక “బాలీవుడ్ కి సూట్” అయ్యే భామ కాదనే ఇంప్రెషన్ ఉంది అందరిలో. అందుకే ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా రష్మిక బాలీవుడ్ ఆలోచనలు లేవని చెప్పుకొచ్చింది.

    Also Read: రష్మీ – సుధీర్ పర్సనల్ వీడియో లీక్: అక్కడ కూడా రొమాన్స్.. !

    మరి ఇప్పుడు ఎందుకు ? సడెన్ గా ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమాని ఒప్పుకొంది ? అని లెక్కలు వేస్తున్నారు టాలీవుడ్ జనం. అయితే ఆ సినిమా కథ ప్రకారం సౌత్ ఇండియన్ భామ కావాలి కాబట్టి, రష్మికను వాళ్ళు తీసుకున్నారు. కానీ, రష్మికకు ఈ సినిమా ఎంతవరకూ ప్లస్ అవుతుందో చూడాలి. మొదట పలువురు హీరోయిన్ల పేర్లని షార్ట్ లిస్ట్ చేసిన “మిషన్ మజ్ను” డైరెక్టర్ కు, రష్మిక బాగా నచ్చిందట. “సరిలేరు నీకెవ్వరు”, “గీత గోవిందం” సినిమాలు చూసి రష్మిక యాక్టింగ్ పై అతను బాగా ఆసక్తి చూపించాడట.

    Also Read: మహేష్ కోసం హైదరాబద్ లో ‘అమెరికా బ్యాంక్’.. !

    దాంతో రష్మికకు 3 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆ సినిమా మేకర్స్ రెడీ అవ్వడంతో.. రష్మిక కూడా వెంటనే అంగీకరించింది. ఎలాగూ బాలీవుడ్ మూవీ.. ప్లాప్ అయినా తనకు వచ్చే నష్టం ఏమి లేదు. ఎలాగూ తెలుగు సినిమాలకు పెద్దగా గ్యాప్ లేదు కాబట్టి, ఎంతకాదు అనుకున్నా బాలీవుడ్ సినిమా చేస్తే తనకి కూడా కొంత అయినా పాన్ ఇండియా మార్కెట్ వస్తోందనేది ఈ క్రేజీ బ్యూటీ ఆలోచన. యాడ్స్ కూడా బాగా వస్తాయి. అందుకే, వెంటనే ఆ సినిమాకి సైన్ చేసింది రష్మిక. మొత్తానికి రష్మిక ప్లానింగ్ మాములుగా లేదు. ఇప్పటికే తమిళ చిత్రం కార్తీ సరసన “సుల్తాన్” అనే సినిమా చేస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్