https://oktelugu.com/

31వ రోజుకు రైతుల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి 31వ రోజుకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం చర్చలకు రెడీ అంటున్నా రైతులు కొన్ని షరతులు విధిస్తున్నారు. దానికి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాగా శనివారం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘెలా రైతులకు మద్దతు తెలిపారు. అహ్మదాబాద్ నుంచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు.మరోవైపు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు మొబైల్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 26, 2020 / 03:01 PM IST
    Follow us on

    కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి 31వ రోజుకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం చర్చలకు రెడీ అంటున్నా రైతులు కొన్ని షరతులు విధిస్తున్నారు. దానికి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాగా శనివారం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘెలా రైతులకు మద్దతు తెలిపారు. అహ్మదాబాద్ నుంచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు.మరోవైపు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు మొబైల్ టవర్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఇలాంటి చర్యలతో సామాన్య ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ అన్నారు. కొన్ని రోజులుగా పంజాబ్ లోని మానస, ఫిరోజ్ పుర్, మేఘ ప్రాంతాల్లో టెలికాం సంస్థపై దాడులు చేస్తున్నారని ఆ సంస్థ ప్రతినిధులు సీఎం ద్రుష్టికి తీసుకెళ్లారు.