Johnny Master Wife : ఈమధ్య కాలం లో డ్యాన్సర్స్ అసోసియేషన్ లో జరిగిన గొడవలు ఏ రేంజ్ లో ఇండస్ట్రీ లో చర్చకు దారి తీశాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియా లోనే టాప్ 2 కొరియోగ్రాఫర్స్ గా చక్రం తిప్పుతున్న జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ మధ్య జరిగిన గొడవ , అందుకు సంబంధించిన వీడియోలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఎంతలా అంటే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆ వీడియో ని చూసి, వీళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడేంతలాగా అన్నమాట. అయితే ఈ వీడియో పై జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ తో తనకు ఎలాంటి గొడవ లేదని , ఈరోజు మధ్యాహ్నం కూడా మేమిద్దరం కలిసి మెగాస్టార్ చిరంజీవి గారితో లంచ్ చేశామని, తనకు ఎలాంటి కష్టమొచ్చినా నేను ముందు ఉంటానని , నాకు ఏ కష్టం వచ్చినా అతను తోడు ఉంటాడని జానీ మాస్టర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
అసోసియేషన్ లో గొడవలు జరగడానికి ముఖ్య కారణం , డబ్బులు దోచుకుంటున్నారని, ఆ కారణం చేత ఫెడరేషన్ ని మూసి వెయ్యాలని జానీ మాస్టర్, అతని బృందం చేస్తున్న డిమాండ్. నిర్మాతల దగ్గర 1500 లు తీసుకుంటే 1000 రూపాయిలు వాళ్ళు దోచేసి , డ్యాన్సర్లకు కేవలం 500 మాత్రమే ఇస్తున్నారని, ఇలా మోసం చేస్తున్నారు కాబట్టే ఫెడరేషన్ ని మూసి వెయ్యాలని డిమాండ్ చేస్తున్నామని జానీ మాస్టర్, ఆయన సతీమణి సుమలత మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు. కానీ శేఖర్ మాస్టర్ , అతని బృందం మాత్రం తప్పు జరిగితే చేసిన వాళ్ళను గుర్తించి శిక్షించండి, అంతే కానీ ఫెడరేషన్ మూసివేయాలి అనడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఇలా వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి.
అయితే కాసేపటి క్రితమే జానీమాస్టర్ సతీమణి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో రిపోర్టర్ సుమలత ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ప్రకాష్ అనే వ్యక్తి అనేక మీడియా చానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ,మోసం చేసారని ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారు కదా , జానీ మాస్టర్ కూడా బొంబాయి డ్యాన్సర్లు కావాలని చెప్పి, ప్రతీ డ్యాన్సర్ నుండి కూడా 4 నుండి 5 వేల వరకు డబ్బులు తీసుకొని మోసం చేసాడని అంటున్నారు. దీనికి మీ సమాధానం’ అని అడగ్గా, ఆమె మాట్లాడుతూ ‘ప్రతీ దానికి జానీ మాస్టర్ అని అంటారు, నాకు మంచి మాటలు రావు , అలాంటి మగాడు లేడా?, జానీ మాస్టర్ పేరు చెప్పుకోకుండా బ్రతకలేరా?,ఆయన పేరు వాడితే తప్ప హైలైట్ అవ్వలేమని అనుకుంటున్నారా?, శేఖర్ మాస్టర్ ముంబై డ్యాన్సర్లను వాడడం లేదా?, భాను మాస్టర్ వాడరా?’ అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. ఇంకా ఆమె ఏమి మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి.
“ఆ #SekharMaster ముంబై అమ్మాయిలనే వాడారా…? భాను మాస్టర్…
చెన్నై నుంచి కూడా పిలిపించుకుంటారు.”– Dancers Union President #SumaLatha, #JaniMaster's wife. pic.twitter.com/PV2CWuCarJ
— iDream Media (@iDreamMedia) July 17, 2026
