Sreeleela : సక్సెస్ ఉంటేనే విలువ..సక్సెస్ లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ ని అయినా తక్కువ చేసి చూసే రోజులివి. చిరంజీవి , రజినీకాంత్ వంటి దిగ్గజాల పనే అయిపోయింది అన్న సందర్భాలు ఉన్నాయి. ఇక నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలు , హీరోయిన్లు ఎంత చెప్పండి. పాపం ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. కన్నడ సినిమాల ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమెకు , టాలీవుడ్ లోకి ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ దక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికీ, హీరోయిన్ శ్రీలీలకు మాత్రం అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘ధమాకా’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు కేవలం ఇది శ్రీలీల డ్యాన్స్ వల్లే హిట్ అయ్యింది అంటూ అప్పట్లో ప్రత్యేక కథనాలు ప్రచారం చేశారు.
నెటిజెన్స్ కూడా శ్రీలీల ని ఒక రేంజ్ లో లేపారు. రాబోయే కాలం లో కాబోయే లేడీ సూపర్ స్టార్ అంటూ ఆమెని ఆకాశానికి ఎక్కించారు. వాళ్ళ దిష్టి గట్టిగా తగిలిందో ఏమో తెలియదు కానీ, ‘ధమాకా’ తర్వాత శ్రీలీల నటించిన చిత్రాల్లో ‘భగవంత్ కేసరి’ తప్ప మరో హిట్ సినిమా లేదు. తక్కువ సమయం లోనే పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ తో నటించే అవకాశం దక్కింది. అవి కూడా పెద్ద ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో అందరూ శ్రీలీలని ఐరన్ లెగ్ అంటూ పిలవడం మొదలు పెట్టారు. ఒక ఆర్టిస్టుగా భరించలేని పదం ఇది. నెటిజెన్స్ నుండి ఇలాంటి మాటలు వస్తే , తట్టుకొని ముందుకు వెళ్లొచ్చు కానీ , ఆ ఐరన్ లెగ్ అనే ముద్ర సినీ నిర్మాతల్లో కలిగితే అసలు భరించలేరు.
తెలుగు లో ఎలాగో వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి , కనీసం తమిళం లో అయినా అదృష్టం పరీక్షించుకోవాలని చూసింది శ్రీలీల . కానీ అక్కడ కూడా ఆమెకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఈమె ధనుష్ ‘ఓం’ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. సాయి పల్లవి ఇందులో మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు , ఈమెకు అజిత్ , అద్విక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కే ఒక సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. అగ్రిమెంట్ మీద శ్రీలీలతో సంతకాలు చేయించుకున్నారు. కానీ ఆమె లేటెస్ట్ ట్రాక్ రికార్డు ని చూసి భయపడ్డారో ఏమో తెలియదు కానీ , ఆమెని ఈ చిత్రం నుండి తప్పించేశారు. అందుకు శ్రీలీల చాలా బాధపడింది అట. సక్సెస్ లో ఉన్నప్పుడు శ్రీలీలని ఏ నిర్మాతలు అయితే నెత్తిన పెట్టుకొని తిరిగారో , ఇప్పుడు అదే నిర్మాతలు ఆమెని క్రిందకు దించేస్తున్నారు.
