Homeఅంతర్జాతీయంEurope Heatwave: వేడిగాలులకు ఖండమే మండిపోతోంది..12,000మంది ప్రాణాలు గాల్లో..

Europe Heatwave: వేడిగాలులకు ఖండమే మండిపోతోంది..12,000మంది ప్రాణాలు గాల్లో..

Europe Heatwave: అవి మామూలు వేడిగాలులు కావు. ఒంట్లో ఉన్న సారాన్ని మొత్తం పీల్చేశాయి. మనుషులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. గొంతు తడి ఆరలేదు. ఊపిరి తీసుకునే అవకాశం లేదు. వేడికి తట్టుకునే సామర్థ్యం లేదు. చివరికి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇలా 12000 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎండ వేడి తగ్గడం లేదు. వేడిగాలుల జోరు ఆగడం లేదు. వాస్తవానికి ఇలాంటి ఇబ్బందిని అక్కడి ప్రజలు ఎన్నడూ ఎదుర్కొలేదు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. వేడిగాలుల తాకిిడికి ప్రజలు ప్రత్యక్షనరకాన్ని చవి చూస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వేడి తగ్గకపోవడంతో సముద్రాలలో జలకాలాడుతున్నారు.

ఇదంతా కూడా యూరప్ ఖండంలో చోటుచేసుకున్న వాతావరణం. అక్కడ వేడి గాలులు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ.. మధ్య ఐరోపా దేశాలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యంత భయానకమైన వడగాలుల ప్రభావం వల్ల.. అక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. యూరప్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. జర్మనీ దేశంలో అయితే 41.7° ఉష్ణోగ్రత.. పోలాంటి ప్రాంతంలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత.. నెదర్లాండ్ ప్రాంతంలో 36.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇటువంటి అసాధారణమైన వాతావరణం వల్ల యూరప్ వ్యాప్తంగా 12000 మందికి పైగా ప్రణాళి కోల్పోయారు.. అత్యంత వేడి, పొడి వాతావరణం వల్ల అడవుల్లో మంటలు ఏర్పడుతున్నాయి. నగరాల లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఫలితంగా విద్యుత్ వినియోగం తీవ్ర స్థాయికి చేరుకుంది.

గత నెల 22 నుంచి 28 మధ్యలో బెల్జియం.. స్పెయిన్.. నెదర్లాండ్స్.. ఫ్రాన్స్.. జర్మనీ.. స్విజర్లాండ్ ప్రాంతాలలో పదివేలకు పైగా ప్రజల ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 18 నుంచి 25 మధ్య ఇంగ్లాండ్.. వేల్స్ ప్రాంతాలలో దాదాపు 2,200 మంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి యూరప్ ఖండంలో తరంలో ఒక్కసారి మాత్రమే ఇటువంటి వాతావరణ మార్పులు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ప్రతి ఏడాది భూతాపం.. అధిక వర్షాలు వంటివి కనిపిస్తున్నాయి.. సహారా ఎడారి నుంచి ఉత్తర దిశగా వేడిగాలులు వస్తున్నాయి. అందువల్లే ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది..ఎల్ నినో కూడా తోడు కావడంతో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version