Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , అఖిల్ కెరీర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రం ఇప్పుడు వారం రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు అందరి ద్రుష్టి మొత్తం ఈ సినిమా ఫుల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందా లేదా అనే దానిపైనే ఉంది. అయితే మొదటి వారం వచ్చిన వసూళ్లను బట్టీ చూస్తే , ప్రస్తుతానికి ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు రావడం కష్టమే అనిపిస్తోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి 7 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 14 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి మొదటి వారం ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రం మొదటి వారం ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది అనే చెప్పాలి. కేవలం ఆ ఒక్క ప్రాంతం నుండే మొదటి వారం చిత్రానికి 10 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 91 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం కూడా లాభాల్లోనే ఉంది కానీ ,అనుకున్నంత ట్రెండ్ మాత్రం కనబర్చడం లేదు. అదే విధంగా ఉత్తరాంధ్ర నుండి 3 కోట్ల 17 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 2 కోట్ల 9 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 33 లక్షలు , గుంటూరు నుండి 1 కోటి 94 లక్షలు , కృష్ణా నుండి 1 కోటి 45 లక్షలు , నెల్లూరు నుండి 94 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 24 కోట్ల 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 40 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 5 లక్షలు , ఓవర్సీస్ నుండి 3 కోట్ల 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 54 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విడుదలకు ముందు ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. ఈ వీకెండ్ వచ్చే వసూళ్లను బట్టీ ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ కి చేరుతుందా లేదా అనేది చూడాలి.
