https://oktelugu.com/

నందు-గీతా మధ్యలో చిచ్చుపెట్టిన రష్మి.. నిజమేనా?

సినిమా వాళ్లపై గాసిప్స్ రాయడం కొత్తమేకాదు.. వాటిని సెలబెట్రీలు కూడా చూసిచూడనట్లు వదిలేస్తుంటారు.. వీటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి.. ఇక వాళ్ల కంటెంట్ వైరల్ అయ్యేందుకు కొందరు కాంట్రావర్సీ థంబ్ నెల్స్ పెట్టి హద్దులు దాటుతుండటం నిత్యం చూస్తునే ఉన్నాం. అలాంటి సంఘటనే ఒకటి నందు-గీత-రష్మిల మధ్య తాజాగా జరిగింది. Also Read: ‘ఆర్ఆర్ఆర్’కు అంత ఓకే.. రాజమౌళిపై బాలీవుడ్ భామ చిన్నచూపు? హీరో నందు.. సింగర్ గీతామధూరిలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 7, 2020 / 11:27 AM IST
    Follow us on

    సినిమా వాళ్లపై గాసిప్స్ రాయడం కొత్తమేకాదు.. వాటిని సెలబెట్రీలు కూడా చూసిచూడనట్లు వదిలేస్తుంటారు.. వీటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి.. ఇక వాళ్ల కంటెంట్ వైరల్ అయ్యేందుకు కొందరు కాంట్రావర్సీ థంబ్ నెల్స్ పెట్టి హద్దులు దాటుతుండటం నిత్యం చూస్తునే ఉన్నాం. అలాంటి సంఘటనే ఒకటి నందు-గీత-రష్మిల మధ్య తాజాగా జరిగింది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’కు అంత ఓకే.. రాజమౌళిపై బాలీవుడ్ భామ చిన్నచూపు?

    హీరో నందు.. సింగర్ గీతామధూరిలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. వీరి అనోన్య దంపత్యానికి ఒక పాప కూడా ఉంది. వీరి కాపురం సజావుగా సాగుతూ ఉంది. ఎవరు ఇంట్లోనే.. బయటికి ఎంతో జాలీగా గడుపుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే ఈక్రమంలోనే నందు హీరోగా.. యాంకర్ రష్మి హీరోయిన్ గా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది.

    ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. నందు-రష్మి సినీ కెరీర్ కు ఈ మూవీ ప్లస్ అవుతుందనే టాక్ విన్పిస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ కూడా అదిరిపోవడంతో ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అవుతుందని అందరూ భావిస్తున్నారు. దీనినే ఆసరా చేసుకొని ఓ యూట్యూబ్ ఛానల్ ‘భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టిన రష్మీ’ హెడ్డింగ్‌ పెట్టి కాంట్రావర్సీకి తెరలేపింది.

    దీనిపై నందు..గీతామాధురి.. రష్మి తనదైన శైలిలో స్పందించారు. ఆ వీడియో థంబ్ నెయిల్ స్క్రీన్ షాట్ తీసి నందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్పందించాడు. ‘మీ బొంద రా మీ బొంద.. ఇది చూసావా గీతా..? ఈ యూ ట్యూబ్ ఛానల్ కోసం మనం గొడవ పడాలి అనుకుంటా’ అని ఫన్నీ కామెంట్ చేసాడు. దీనికి గీతామధూరి స్పందిస్తూ ‘హా చూసాను బుజ్జి.. కరోనాకి అయినా వాక్సిన్ వస్తుందేమో కానీ ఈ థంబ్ నెయిల్ ఫెలోస్ మాత్రం చేంజ్ అవ్వరు..’ అంటూ కామెంట్ చేసింది. రష్మి సైతం ‘ఏంటో వీళ్ళ బాధ’ అంటూ కామెంట్ చేసింది.

    Also Read: బంగార్రాజుకి క్లారిటీ లేదు.. బాధలో డైరెక్టర్ !

    కాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే ఎవరైతే ఎవరైతే క్రియేటివ్‌గా మీమ్స్ చేస్తారో వారికి 10వేలు క్యాష్ ప్రైజ్ ఇస్తానని నందు ప్రకటించాడు. ఎవరెన్ని పంచులు వేసినా.. మీమ్స్ చేసినా కూడా పట్టించుకోనని చెప్పిన నందు తాఆగా ఓ స్టోరీపై రియాక్ట్ అవడంతోపాటు సెటైర్ వేసాడు. దీంతో ‘భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టిన రష్మీ’ వీడియోకే 10వేలు దక్కుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో నందు-గీతలు మెచ్చే క్రియేటివ్ మీమ్స్ ఏదై ఉంటుందనే చర్చ నడుస్తోంది.