https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’కు అంత ఓకే.. రాజమౌళిపై బాలీవుడ్ భామ చిన్నచూపు?

దర్శకదిగ్గజం రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం నందమూరి, మెగా ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు. Also Read: బంగార్రాజుకి క్లారిటీ లేదు.. బాధలో డైరెక్టర్ ! కరోనా కారణంగా ఆగిపోయిన ఈ మూవీ తాజాగా షూటింగుకు రెడీ అవుతోంది. వచ్చే వేసవిలో సినిమా విడుదల చేసేందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 7, 2020 / 11:20 AM IST
    Follow us on


    దర్శకదిగ్గజం రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం నందమూరి, మెగా ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    Also Read: బంగార్రాజుకి క్లారిటీ లేదు.. బాధలో డైరెక్టర్ !

    కరోనా కారణంగా ఆగిపోయిన ఈ మూవీ తాజాగా షూటింగుకు రెడీ అవుతోంది. వచ్చే వేసవిలో సినిమా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తోంది. ఈమేరకు ‘ఆర్ఆర్ఆర్’ను పట్టాలెక్కించేందుకు రాజమౌళి సిద్ధమవుతోన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగు తాజాగా ప్రారంభంకాగా రాంచరణ్.. ఎన్టీఆర్ సహా ప్రధాన తారాగాణం సెట్లో సందడి చేస్తున్నారు. అయితే బాలీవుడ్ భామ అలియాభట్ మాత్రం ఇంకా షూటింగులో పాల్గొనలేదు.

    ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ అల్లూరి సీతరామరాజు పాత్రలో నటిస్తుండగా సీత పాత్రలో అలియా భట్ నటించనుంది. ప్రస్తుతం ప్రారంభమైన ఆర్ఆర్ఆర్ షూటింగులో మాత్రమే అలియాభట్ ఎక్కడ కన్పించడం లేదు. అలియాభట్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగూబాయి కతియావాడి’లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగు ముంబైలో జరుగుతోంది. దీంతో ఆమె ఆర్ఆర్ఆర్ కు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అలియా నవంబర్ నాటికి ఆర్ఆర్ఆర్ షూటింగులో పాల్గొననుందట.

    రాంచరణ్-అలియాభట్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగా ఆమె ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దర్శకుడు ఆర్ఆర్ఆర్ లో అలియాభట్ పాత్ర మినహా మిగతా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఆమె వచ్చాక ఆ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అలియాభట్ ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకుందనే ప్రచారం జరుగగా స్వయంగా ఆమె ఆ వార్తలను ఖండించింది.

    Also Read: ఒకేసారి రెండు సినిమాలతో సీనియర్ హీరో !

    ఈ భామ ‘ఆర్ఆర్ఆర్’ కంటే సంజయ్ లీలా భన్సాలీ చిత్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. దర్శక ధీరుడి ప్రతిభ గురించి ఈ అమ్మడికి ఇంకా తెలిసినట్లు లేదని.. అందుకే ఈ భామ ఇలా వ్యవహరిస్తుందనే ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అలియా భట్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..!