Sudigali Sudheer- Rashmi: బుల్లితెరపై ఉర్రూతలూగించే జబర్దస్త్ షో గురించి తెలియని వారుండరు. ఎందరో జీవితాలను నిలబెట్టిన ఈ ప్రొగ్రాంలో ఒకప్పటి కమెడియన్స్ ఇప్పుడు లేరు. కానీ వారి గురించి కొన్ని విషయాలు ప్రస్తావించినప్పుడు వారితో కలిసి పనిచేసినవారు అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటున్నారు. జబర్దస్త్ లవ్ కపుల్ గా పేరొందిన సుధీర్-రష్మీలు చాలా డీప్ గా ప్రేమలో పడ్డారని టాక్. ఈ నేపథ్యంలో వీరి మధ్య జరిగిన కొన్ని రొమాన్స్ సన్నివేశాలు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. అవన్నీ ఇప్పుడు జరగకపోయినా ఓ సందర్భంగా గెటప్ శీను ఇప్పుడు గుర్తు చేయడంతో సిగ్గుపడడం రష్మివంతయింది. పాపం సుధీర్ ప్రస్తుతం జబర్దస్త్ లో లేకపోయినా ఆయన పేరెత్తెసరికి ఒళ్లు పులకరించినట్లయింది రష్మికకు.

ఒకప్పుడు సుధీర్-రష్మిలు స్కిట్లోకి వస్తే ఆ హుషారే వేరు. లవ్ ట్రాక్ ను సీన్ లోకి తెచ్చి వీరిద్దరు కలిసి ఆడియన్స్ కు విపరీతమైన వినోదాన్ని అందించేవారు.దీంతో ఈ జంట వేదికపైకి ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎదురుచూసేవాళ్లు. కానీ ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ లో లేడు. కొన్ని కారణాల వల్ల ఈ షోను వదిలి వెళ్లాడు. సుధీర్ మాత్రమే కాకుండా ఆయన తోటి వాళ్లలో చాలా మంది ఇందులో నుంచి వెళ్లిపోయారు. అయితే కొందరు తిరిగి జాయిన్ అయ్యారు. ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్లు షో నుంచి వెళ్లకుండా కొనసాగుతున్నారు. గెటప్ శీను కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్నా మళ్లీ జబర్దస్త్ లోనే కొనసాగుతున్నారు.
జబర్దస్త్ లెటేస్ట్ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదలయింది. ఇందులో కంటెస్టెంట్ల కంటే జడ్జిగా ఉన్న కృష్ణ భగవాన్ పంచులే పేలుతున్నాయి. అటు మాజీ హీరోయిన్ కుష్బూ తన పర్సనల్ స్టోరీ చెప్పి ఎమోషనల్ అయింది. ఇక ఇమ్మాన్యూయేల్, రష్మిలు చేసిన కామెడీ ఆకట్టుకున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. కానీ ఇందులోని ఓ సీన్ వైరల్ గా మారింది.

టైం మిషన్లో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఎవరెవరు ఎక్కడికి వెళ్తారు..? అని రష్మిక అందరినీ ప్రశ్నించింది. వెంటనే సన్నీ కల్పించుకొని నేను.. నిన్న మందు కొట్టలేదని, అందుకే ఒకరోజు వెనక్కి వెళ్తానని అనడంతో నవ్వులు పూశాయి. ఆ తరువాత కుష్భూ తనకు ఒబెన్ అనే హెయిర్ స్టైలిస్ ఉండేదని, ఆమె మరణించిందని చెప్పారు. అవకాశం ఉంటే ఆమెను మళ్లీ కలవాలని ఉందని చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్తావ్ అని రష్మీని రాంప్రసాద్ ప్రశ్నిస్తాడు. కానీ రష్మి సమాధానం చెప్పేలోగా 2014 ఫిబ్రవరి 14 తేదీకంటూ.. గెటప్ శీను లవ్ సింబల్ చూపిస్తాడు. అంటే రష్మి సుధీర్ లు ఈ రోజు మొదటిసారి కలుసుకున్నారని అంటాడు. దీంతో రష్మి సిగ్గుపడుతూ చేతులు అడ్డం పెట్టుకుంటుంది.