Diwali Movies 2022: మన తెలుగువాళ్లకు సంవత్సరంలో ఎన్నో పండుగలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఫెస్టివెల్ మూడ్ ఇంట్లోనే కాకుండా సినిమా థియేటర్లో కూడా ఉంటుంది. ప్రతీ పండుగ సందర్భంగా ఎన్నో కొన్ని సినిమాలు రిలీజ్ చేసి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఈ దీపావళి సందర్భంగా కూడా నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. వీటిలో ఓరీ దేవుడా, జిన్నా, సర్దార్, ప్రిన్స్ లిస్టులో ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులకు దీవాళీ ఆపర్లు ప్రకటించారు. ఓటీటీ వేదికగా ఏకంగా 15 సినిమాలు రిలీజ్ చేయబోతున్నాయి. దీంతో పండుగలో సినిమాలతో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చన్నమాట. మరి ఆ 15 సినిమాలు ఏవేవో తెలుసుకుందాం.
1) బింబిసార:
కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో నటించిన ‘బింబిసార’ సూపర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను థియేటర్లో చూడని వారు ఓటీటీలో చూడాలని ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బింబిసారను జీ 5 లో 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.

2) ఒకేఒక జీవితం:
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన సినిమా ఒకేఒక జీవితం. శర్వానంద్, రీతూ వర్మ జోడిగా నటించిన ఇందులో అమల ప్రధాన పాత్రలో నటించారు. దీనిని 21 నుంచి సోనీ లైవ్ లో ప్రసారం చేయనున్నారు.
3) అమ్ము:
ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. చారుకేశ్ డైరెక్ట్ చేసిన ఇందులో ఐశ్వర్య లక్ష్మి, బాబీ సింహా, నవీన్ చంద్ర తదితర ప్రముఖులు ఉన్నారు.
4) ఫోర్ మోర్ షాట్స్:
హిందీ వెబ్ సిరీస్ అయిన ఫోర్ మోర్ షాట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలను 21 నుంచి ప్రసారం కానుంది.
5) ద పెరి ఫెరల్:
ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నారు.
6) బార్బేరియన్స్ (పార్ట్ 2) :
ఇది 21న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
7) ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్:
నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ ఈనెల 19నే రిలీజై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
8) ఫ్రమ్ స్క్రాచ్:
వెబ్ సిరీస్ అయిన ఇది 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
9) ట్రిప్లింగ్:
హిందీ వెర్షన్లో ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో 21 నుంచి ప్రసారం అవుతుంది.
10 కవి సామ్రాట్:
ఎల్ బీ శ్రీరామ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
11) పెట్టై కాలి:
తమిళ మూవీ అయిన పెట్టై కాలి 21 నుంచి నెట్ ఫ్లిక్స్ ప్రసారం కానుంది.
12) కపటనాటక సూత్రధారి:
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి కపటనాటక సూత్రధానిని 21 నుంచి చూడొచ్చు.
13) లైగర్:
పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ హిందీ వర్సెన్ మాత్రమే 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) కృష్ణ వింద విహారి:
నాగశౌర్య నటించిన ఈ మూవీ 23 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.
15) స్వాతిముత్యం:
బెల్లంకొండ గణేశ్ నటించిన ఈ సినిమా 24 నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది.