Heroine Kasthuri: సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార ఇటీవలే తన ప్రియుడు సతీష్ విఘ్నేష్ ని పెళ్లాడిన సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్ళ పెళ్లి జరిగి కేవలం నాలుగు నెలలు మాత్రమే పూర్తి అయ్యింది..నిన్నగాక మొన్న హనీమూన్ టూర్ కి వెళ్లిన ఈ జంట నాలుగు నెలల్లోనే తల్లి తండ్రులు అయ్యాము అంటూ ట్విట్టర్ లో నయనతార భర్త ట్వీట్ చెయ్యడం అభిమానులను షాక్ కి గురి చేసింది..పెళ్ళైన నాలుగు నెలలకే పిల్లలు ఏంటి అంటూ ప్రశ్నలు వెయ్యడం ప్రారంభించారు..కానీ నయనతార – విగ్నేష్ దంపతులు సరోగసి ద్వారా సంతానం ని పొందారు.

చట్టరీత్యా సరోగసి పద్దతి ద్వారా పిల్లల్ని కనడం ఈమధ్యనే భారత దేశ ప్రభుత్వం బ్యాన్ చేసింది..కానీ ఆ పద్దతి ద్వారానే నయనతార – విఘ్నేష్ జంట సంతానం ని పొందడం తో అది చట్టరీత్యా నేరంగా పరిగిణింపబడింది..ఇప్పుడు ఇదే నయనతార – విఘ్నేష్ కి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.
అయితే నయనతార భర్త మేము కవలపిల్లలకు తల్లితండ్రులము అయ్యాము అని ట్వీట్ వెయ్యగానే ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియచేసారు..కానీ ‘గృహలక్ష్మి’ సీరియల్ హీరోయిన్ కస్తూరి అలియాస్ తులసి ఈ సరోగసి చట్టం గురించి ట్వీట్ వెయ్యగానే అది పెద్ద గందరగోళం కి దారి తీసింది..కస్తూరి వేసిన ఈ ట్వీట్ క్రిందనే తమిళనాడు కి చెందిన మంత్రి రిప్లై ఇచ్చాడు..దీని మీద విచారణ జరుపుతాము అని ఆయన ఈ సందర్భంగా తెలిపాడు..ఇక మరుసటి రోజు దీనిపై వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయనతార దంపతులకు నోటీసులు జారీ చేసారు..అయితే ఈ విచారణలో నయనతార ఎలాంటి ఆధారాలను అందించలేకపోయిందట.

సరోగసి ద్వారా సంతానం పొందాలంటే దంపతులకు పెళ్లి జరిగి 5 సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి..అంతే కాకుండా ఆరోగ్య సమస్యలు ఉంటేనే సరోగసి చెయ్యడానికి ఆ దంపతులు అర్హులు అవుతారు..అయితే నయనతార దంపతులు మేము పెళ్లి చేసుకొని ఆరేళ్ళు అయ్యింది అంటూ చెప్పుకొచ్చారు..కానీ దానికి ఎటువంటి ఆధారాలు కూడా వాళ్ళు చూపించలేదు..దీనితో చట్టరీత్యా వీళ్లిద్దరు జైలు పాలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.