Rashmi Gautam: హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతుంది. ఆమె మాటల్లో లొసుగులు ఉండవు. ఏదైనా డైరెక్ట్ గానే చెబుతుంది. బుల్లితెర పై హాట్ యాంకర్ గా రష్మీ గౌతమ్ కి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అయితే, ఆమె సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తింది. ఛాన్స్ కోసం ఒకరు తమ దగ్గర ఉన్నది ఇస్తారు, ఛాన్స్ ఇవ్వడానికి ఇంకొకరు తమకు కావాల్సింది అడుగుతారు, ఇది పక్కా బిజినెస్ థింక్. అయినా ఇలా ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో చేసుకునే రొమాన్స్ ను అసలు కాస్టింగ్ కౌచ్ అనడం పాపం అంటుంది రష్మీ గౌతమ్.

రష్మీ గౌతమ్ ఈ విషయాన్ని ఇంత బోల్డ్ గా ఎందుకు చెప్పిందో తెలియదు గానీ, ఆమె కామెంట్స్ మాత్రం కాస్టింగ్ కౌచ్ ను సపోర్ట్ చేసేలా ఉన్నాయి. ఒక రకంగా ఇష్టపడి కోరుకున్నది సాధించడం కోసం చేసే పనికి, క్యాస్టింగ్ కౌచ్ అని పేరు పెట్టడం తప్పు అంటుంది. మొత్తానికి రష్మీ గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. నిజానికి ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు తాము కాస్టింగ్ కౌచ్ బాధితులం అని ఇప్పటికే కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు.
మరి వీరంతా రష్మీ మాటలు ఆమెను ఏం చేస్తారో. మరోపక్క రష్మి గౌతమ్ చేసిన ఈ కామెంట్స్ పై కొందరు నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. మొత్తమ్మీద రష్మీ గౌతమ్ మంచి పొజిషన్ కోసం పడుకోవడంలో తప్పులేదు అంటుంది. ఇక రష్మీ గౌతమ్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఆమెకు టీవీ షోలలో అవకాశాలు ఉన్నప్పటికీ, సినిమాల్లో మాత్రం ఈ బ్యూటీని పెద్దగా పట్టించుకోవడం లేదు.
చివరకు అనసూయకి వస్తోన్న ఐటమ్ సాంగ్స్ కూడా రష్మీకి రావాడం లేదు. ఎప్పటికప్పుడు ఈ అమ్ముడు తన నటనా ప్రదర్శనను పెంచుకుంటూ పోతుంది. అయినా ఎందుకో.. మూవీ మేకర్స్ మాత్రం రష్మీలో హీరోయిన్ ను చూడలేకపోతున్నారు. అందుకే రష్మీ గౌతమ్ ఇక పూర్తిగా సినిమాలకు టాటా చెప్పిందట.

కొత్తగా కొన్ని చిన్న సినిమాలు వస్తోన్నా.. ఆమె ఏవీ ఒప్పుకోవడం లేదట. తానూ ఇక పూర్తిగా టీవీ కెరీర్ పైనే ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిందట. నిజానికి “గుంటూరు టాకీస్” సినిమాతోనే రష్మీ హీరోయిన్ గా సక్సెస్ అయింది. పైగా ఆ సినిమాతో యూత్ లో సెక్స్ సింబల్ ఇమేజ్ ను కూడా పొందింది. ఆ తర్వాత రష్మీకి చెప్పుకోతగ్గ సినిమా మళ్ళీ రాలేదు. వచ్చినా చిన్నాచితకా అరడజన్ సినిమాలు కూడా ఆమె కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడకపోగా, పూర్తిగా డ్యామేజ్ చేశాయి. అందుకే ఇక సినిమాలు చేయదు అట.