Homeబిజినెస్Gautam Adani: ఆసియా సంపన్నుడు అదానీ.. సెకనుకు రూ.1.4 కోట్ల సంపాదన

Gautam Adani: ఆసియా సంపన్నుడు అదానీ.. సెకనుకు రూ.1.4 కోట్ల సంపాదన

Gautam Adani: వంట నూనెల నుంచి పోర్టుల వరకు వివిధ వ్యాపారాలు చేస్తున్న అదానీ గ్రూప్‌ బాస్‌ గౌతమ్‌ అదానీ సంపద విషయంలో మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ను ఇప్పటికే దాటేశారు. నెల కిందట సీనియర్‌ ఇన్‌వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ సంపదను దాటిన అదానీ, తాజాగా బిల్‌గేట్స్‌ను దాటి గ్లోబల్‌ రిచ్‌లిస్ట్‌లో నాలుగో ప్లేస్‌కు చేరుకున్నారు. అంతేకాకుండా సంపదలో బిల్‌గేట్స్‌కు గౌతమ్‌ అదానీకి మధ్య 10 బిలియన్‌ డాలర్లు తేడా కూడా ఉంది. అదానీ గ్రూప్‌లోని ముఖ్యమైన కంపెనీల్లో ఒకటైన అదానీ పవర్‌ లిమిటెడ్‌ మూడు నెలల్లో రూ.4779.86 కోట్లు లాభం ఆర్జించింది. గత ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు కంపెనీ రికార్డుస్థాయిలో లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం లాభం రూ.278.22 కోట్లు. స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియాకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ విషయాన్ని పేర్కొంది.

Gautam Adani
Gautam Adani

మొదటి త్రైమాసికంలో రూ.9642.8 కోట్లు..
జూన్‌తో ముగిసిన ఆర్థిక త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.15,509 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.7213.21 కోట్లు. గత ఏడాది జూన్‌ త్రైమాసికంలో రూ.6763.5 కోట్లుగా ఉన్న వ్యయం గత ఆర్థిక త్రైమాసికంలో రూ.9642.8 కోట్లకు పెరిగింది.

Also Read: Fake Online Shopping Websites: ‘ఈ’ దోపిడీ.. ఆ సైట్లలో వస్తువులు కొంటే అంతే..!! డబ్బులు ముందే చెల్లించొద్దు!

అతిపెద్ద ప్రైవేట్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌..
అదానీ పవర్‌ లిమిటెడ్‌ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ థర్మల్‌ పవర్‌ ఉత్పత్తిదారుగా ఉంది. గుజరాత్‌తోపాటు, కంపెనీ ఏడు ప్రదేశాలలో ఉన్న థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల నుంచి 1,3610 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో ఇటీవలి కాలంలో గౌతమ్‌ అదానీ వ్యాపారంలో భారీ వృద్ధిని సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదానీ ఆస్తులు 115 బిలియన్‌ డాలర్లు. అతని ఆదాయం సెకనుకు రూ.1.4 కోట్లు అని సమాచారం.

Gautam Adani
Gautam Adani

గంటకు రూ. 83.4 కోట్లు సంపాదిస్తున్నాడు. బిజినెస్‌ స్టాండర్డ్‌ రిపోర్ట్‌ ప్రకారం గౌతం అదానీ ఆదాయం రోజుకు రూ.1000 కోట్లు. గౌతమ్‌ అదానీ అదానీ గ్రూప్‌ చైర్మన్‌గా అదానీ ఏడాదికి రూ.1.8 లక్షల కోట్లు రెమ్యునరేషన్‌గా పొందుతున్నాడు. అదానీ నెలవారీ ఆదాయం రూ.15,000 కోట్లు. ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో బిల్‌ గేట్స్‌ను అధిగమించి అదానీ నాలుగో స్థానంలో నిలిచారు.

బిల్‌గేట్స్‌ను మించిపోయాడు..
ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్‌ లిస్ట్‌ ప్రకారం, గౌతమ్‌ అదానీ – ఆయన కుటుంబం సంపద రూ.112.9 బిలియన్‌ డాలర్ల (రూ.9 లక్షల కోట్ల) కు పెరిగింది. అదే బిల్‌గేట్స్‌ సంపద 102.4 బిలియన్‌ డాలర్ల (రూ.8.19 లక్షల కోట్ల)కు తగ్గిపోయింది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతుండడంతో గ్లోబల్‌గా మైక్రోసాఫ్ట్‌ వంటి టెక్, ఐటీ కంపెనీల షేర్లు పడుతున్నాయి. దీంతో బిల్‌గేట్స్‌ సంపద తగ్గింది. అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు పెరుగుతుండడంతో గౌతమ్‌ అదానీ సంపద పెరిగింది. ఈ ఏడాది గౌతమ్‌ అదానీ సంపద 32 బిలియన్‌ డాలర్లు (రూ.2.56 లక్షల కోట్లు) పెరగగా, ఇదే టైమ్‌లో బిల్‌గేట్స్‌ సంపద 36 బిలియన్‌ డాలర్లు (రూ. 2.88 లక్షల కోట్లు) తగ్గింది. ఫోర్బ్స్‌ రియల్‌టైమ్‌ బిలియనీర్స్‌ లిస్టులో టాప్‌లో టెస్లా బాస్‌ ఎలన్‌ మస్క్‌ కొనసాగుతుండగా, రెండో ప్లేస్‌లో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (లూయిస్‌ విట్టన్స్), మూడో ప్లేస్‌లో అమెజాన్‌ బాస్‌ జెఫ్‌ బెజోస్‌ ఉన్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 87.3 బిలియన్‌ డాలర్ల సంపదతో 10వ ప్లేస్‌లో ఉన్నారు.

Also Read:MP Gorantla Madhav Controversy: ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో వివాదంలో ఊహించని ట్విస్ట్..

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular