https://oktelugu.com/

Rashmi: సుధీర్ అలా చేయడంతో షోలో కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ.. ఏం జరిగిందంటే?

Rashmi: ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమో నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రోమోలో మంత్రి కావడం వల్ల జబర్దస్త్ షోకు దూరం అవుతుండటంతో రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి కావడం వల్ల సర్వీస్ అంటే ఇష్టం ఉండటంతో ఈ షోకు దూరమవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రోమోలో రాకేష్ సుజాతతో సుజీ.. నీకు గుర్తుందా.. ఒకప్పుడు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 19, 2022 / 11:37 AM IST
    Follow us on

    Rashmi: ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమో నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రోమోలో మంత్రి కావడం వల్ల జబర్దస్త్ షోకు దూరం అవుతుండటంతో రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి కావడం వల్ల సర్వీస్ అంటే ఇష్టం ఉండటంతో ఈ షోకు దూరమవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

    ప్రోమోలో రాకేష్ సుజాతతో సుజీ.. నీకు గుర్తుందా.. ఒకప్పుడు ఇక్కడే కూర్చుని ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్పి అందరినీ ఏడిపించావని అదే మెట్ల దగ్గర కూర్చుని మనం ఏడవాల్సి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత క్యాష్ షో పేరడీ స్కిట్ చేయగా రోహిణి సుమ పాత్ర చేశారు. రోహిణి తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలుగా మారడానికి ఎంత సమయం పడుతుందని అడగగా రష్మీ చెప్పవా ఎపిసోడ్ కు ఎపిసోడ్ కు మధ్య రోజూ పోతావ్ కదా టూ త్రీ హవర్స్ అంటూ రోజా రష్మీ పరువు తీసేశారు.

    స్కిట్ లో రామ్ ప్రసాద్, సుధీర్ మొక్కజొన్న, సోడాలు అమ్ముకుంటూ నవ్వులు పూయించారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ పొద్దున మీరు ఫైమాను నుదుటిపై కిస్ చేశారు కదా ఒక్కసారి నాకు కూడా కిస్ కావాలని ఇమ్మాన్యుయేల్ అడగగా పూర్ణ ఇమ్మాన్యుయేల్ చేతికి కిస్ పెడతారు. పూర్ణ అలా చేయడం అవాక్కవడం వర్ష వంతవుతుంది. ఆ తర్వాత సుధీర్ పూర్ణ బుగ్గను కొరుకుతానని చెబుతాడు.

    పూర్ణ రండి అంటూ సుధీర్ ను పిలవగా రష్మీ ఎమోషనల్ అవుతారు. రోజాగారు.. సుధీర్ పూర్ణను కొరికితే మాత్రం నేను ఫీలవుతానని చెబుతారు. ఆ సమయంలో రష్మీ కళ్లు ఏడుస్తున్నట్టుగా ఉంటాయి. ఈ నెల 22వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. రోజా జబర్దస్త్ కు దూరం కావడంతో ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో చూడాల్సి ఉంది.

    Recommended Videos: