https://oktelugu.com/

Vijay Deverakonda: విజయ్.. ‘సమంత’నే కాదు, ‘పవన్’ను కూడా వదల్లేదు

Vijay Deverakonda: మ్యాటర్ లేకపోయినా తన పై తన సినిమాల పై బజ్ క్రియేట్ చేయడంలో.. విజయ్ దేవరకొండకి మేకప్ తో అబ్బిన విద్య. సాధారణ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ గా మారిన విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌ లో ‘సమంత’ హీరోయిన్ గా ఓ సినిమా వస్తోంది. అయితే, ఈ సినిమా టైటిల్ పై ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ‘పవన్ కళ్యాణ్’ను ‘పవర్ స్టార్’ ని చేసిన […]

Written By:
  • Shiva
  • , Updated On : April 19, 2022 / 11:58 AM IST
    Follow us on

    Vijay Deverakonda: మ్యాటర్ లేకపోయినా తన పై తన సినిమాల పై బజ్ క్రియేట్ చేయడంలో.. విజయ్ దేవరకొండకి మేకప్ తో అబ్బిన విద్య. సాధారణ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ గా మారిన విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌ లో ‘సమంత’ హీరోయిన్ గా ఓ సినిమా వస్తోంది. అయితే, ఈ సినిమా టైటిల్ పై ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.

    Pawan Kalyan-Vijay Deverakonda

    ‘పవన్ కళ్యాణ్’ను ‘పవర్ స్టార్’ ని చేసిన సినిమా ‘ఖుషీ’. అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపిన ఈ సినిమా.. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. పైగా 2001 వరకు ఉన్న రికార్డులను తిరగరాసిన హిస్టరీ కూడా ఈ సినిమాకి ఉంది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై విజయ్ దేవరకొండ మనసు పారేసుకున్నాడు.

    Also Read: Narayan Das k Narang Passed Away: షాకింగ్ : ప్రముఖ నిర్మాత కన్నుమూత !

    ఎలాగూ తన సినిమాలో సమంతను హీరోయిన్ గా ఒప్పించాడు, ఇప్పుడు, ఈ సినిమాకి పవన్ టైటిల్ ను కూడా ఫిక్స్ చేస్తే.. సినిమాకి అదనపు ఆకర్షణగా ఉంటుందని విజయ్ దేవరకొండ టీమ్ ప్లాన్ చేస్తోంది. మరి విజయ్ దేవరకొండతో సమంత ‘ఖుషీ’ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి విజయ్… సమంతనే కాదు, పవన్ ను కూడా వదలడం లేదు.

    పైగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం సమంత బోల్డ్ లుక్ లో కనిపించనుంది. చాలా కాలం తర్వాత.. సమంత హీరోయిన్ గా చేస్తున్న మొట్టమొదటి ఫుల్ కమర్షియల్ అండ్ బోల్డ్ సినిమా ఇదే. అందుకే సామ్, తన కెరీర్ లోనే ఇది స్పెషల్ ఫిల్మ్ గా ట్రీట్ చేస్తోంది.

    Vijay Deverakonda

    పైగా సామ్ – విజయ్ దేవరకొండ గతంలో మహానటిలో కూడా కలిసి జోడీగా నటించారు. మళ్ళీ విజయ్ దేవరకొండతో సామ్ మరో సినిమా చేస్తుండేసరికి మొత్తానికి సామ్ ఫామ్ లో వస్తోందని ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మహానటి ఘన విజయం సాధించింది. కాబట్టి.. ఆ సినిమా తాలూకు పాజిటివ్ వైబ్స్ ఈ సినిమా పై కూడా పడనున్నాయి.

    Also Read:Nagarjuna Hello Brother Movie: ఆ స్టార్ హీరో నాగార్జునకి డూప్.. కారణం ఆయనే !

    Recommended Videos:

    Tags