Narayan Das k Narang Passed Away: ఏషియన్ మల్టీప్లెక్స్ , ఏషియన్ థియేటర్స్ అధినేత మరియు నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ ఇక లేరు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు చనిపోయారు. ఆయన వయసు 76 సంవత్సరాలు.
ఇటీవల నాగచైతన్య ‘లవ్ స్టోరీ’,నాగశౌర్యతో ‘లక్ష్య’ సినిమాలను నారాయణ్ దాస్ కె నారంగ్ నిర్మించారు. ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’, అలాగే ధనుష్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నారాయణ్ దాస్ కె నారంగ్ గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సునీల్ నారంగ్, భరత్ నారంగ్. వీరు కూడా నిర్మాతలే.
Also Read: Nagarjuna Hello Brother Movie: ఆ స్టార్ హీరో నాగార్జునకి డూప్.. కారణం ఆయనే !
నారాయణ దాస్ నారంగ్ 1946 జులై 27న జన్మించారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మూవీ ఫైనాన్షియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో నారాయణ్ దాస్ కె నారంగ్ గారికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. టాలీవుడ్ కి ఎనలేని సేవలను అందించిన నారాయణ దా కె నారంగ్ మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.
నారాయణ దాస్ ఏషియర్ గ్రూప్ అధినేత గ్లోబల్ సినిమా స్థాపకుడు కూడా. ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున నారాయణ్ దాస్ కె నారంగ్ గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read:Jobs: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.90 వేల వేతనంతో ఉద్యోగ ఖాళీలు
Recommended Videos: