Ranga Ranga Vaibhavanga Collections: పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా ‘రంగ రంగ వైభవంగా’ అంటూ వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ చిత్రంగా నిలిచింది. మొదటి వారం ఈ మూవీ చెప్పుకోదగ్గ కలెక్షన్లను నమోదు చేయలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

ముందుగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కు గానూ ఏరియాల వారీగా ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎలా వచ్చాయి అంటే ?
నైజాం 1.07 కోట్లు
సీడెడ్ 0.30 కోట్లు
ఉత్తరాంధ్ర 0.37 కోట్లు
ఈస్ట్ 0.33 కోట్లు
వెస్ట్ 0.20 కోట్లు
గుంటూరు 0.31 కోట్లు
కృష్ణా 0.26 కోట్లు
నెల్లూరు 0.17 కోట్లు
మొత్తానికి ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కు గానూ ‘ ‘రంగ రంగ వైభవంగా’ రూ. 3.01 కోట్లు కలెక్ట్ చేసింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.21 కోట్లు
ఓవర్సీస్ 0.51 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కు గానూ ‘రంగ రంగ వైభవంగా’ రూ. 3.73 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.

‘రంగ రంగ వైభవంగా’ చిత్రానికి రూ.8.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ, ఫస్ట్ వీక్ కి వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ లెక్కలను బట్టి నష్టాలను అంచనా వేస్తే.. ఈ సినిమాకి 6 కోట్ల వరకు భారీ నష్టాలు రానున్నాయి.