Anchor Anasuya Bharadwaj: అనసూయ గత కొన్ని రోజులగా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. మరోపక్క ట్రోలర్లు ఆంటీ అంటూ ఆమె పై విరుచుకుపడుతున్నారు. నోటికొచ్చినట్టుగా కామెంట్లు పెడుతూ అనసూయకి టార్చర్ చూపిస్తున్నారు. ముఖ్యంగా అనసూయను పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ ఆమెను బాగా విసిగిస్తున్నారు. అయితే, తనను ఆంటీ అని విమర్శిస్తే ఎంత దూరమైనా వెళ్తానని చెబుతుంది. అయితే ఈ విషయంలో ఆమెను కావాలనే టార్గెట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కొందరు ఆమెను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కారణం, అనసూయ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటుంది. బుల్లితెరతో పాటుగా వెండితెరపై అనేక ఛాన్సులు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా తన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే అనసూయ ఎదుగుదలను చూసి ఓర్వలేక పోతున్నారు కొందరు. ఇండస్ట్రీలోని ఆ వ్యక్తులు రకరకాలుగా ఆమెను టార్గెట్ చేస్తున్నారు.
ముఖ్యంగా అనసూయ వస్త్రధారణ, భాష విషయంలోనే కాకుండా ఇతర యాంకర్స్ తో కూడా పోలుస్తూ పెద్ద చర్చలు పెడుతున్నారని, పైగా అనసూయ గురించి నెగిటివ్ టాక్ ను కూడా ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి అనసూయ ఇమేజ్ ను దెబ్బ తీయడానికి ఆమె పేరు మీద నకిలీ ప్రొఫైల్స్ ను కూడా క్రియేట్ చేసి ఆమెకు బ్యాడ్ నేమ్ తీసుకువచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందట. మొత్తానికి అనసూయ పై బాగానే కుట్ర జరుగుతుంది.

మొత్తమ్మీద అనసూయ పై ఎంతమంది ఎన్ని రకాలుగా దాడులు చేసిన ధీటుగా తట్టుకుని నిలబడుతుంది ఆమె. పైగా సినిమాలతో పాటు ఇటు ఓటీటీలో విడుదలయ్యే వెబ్ సిరీస్ లలోనూ అనసూయ అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ప్రత్యేక పాత్రల్లో నటించి అలరిస్తోంది. వైవిధ్యమైన పాత్రలతో వైవిధ్యాన్ని కూడా చూపిస్తోంది.
అసలు అటు మోడ్రన్ లుక్ అయినా, ఇటు ట్రెడిషనల్ లుక్ అయినా అనసూయ మాత్రం ఒకేలా ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది.