Ramoji Rao: ఈనాడు(Eenadu) సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మీడియా అధినేతగా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా ఆయన ఎన్నో శిఖరాలను తాకారు. కానీ ఆయనకు తీరని కోరిక ఒకటి ఉండిపోయిందట .
దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన సేవలు అందిస్తున్నారు . ఎంతోమంది యంగ్ హీరోలు, హీరోయిన్స్, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఉషా కిరణ్ మూవీస్(Usha Kiran Movies) ద్వారా అనేక అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. మీడియా, వినోద రంగంలో చెరగని ముద్ర వేశారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో ఆయన నిర్మించిన చిత్రాలు సంచలనాలు నమోదు చేశాయి.
Also Read: Manchu Lakshmi: మంచు లక్ష్మి విడాకుల వెనుక ఇంత తతంగం నడిచిందా?
1983లో రామోజీరావు ఉషా కిరణ్ మూవీస్ స్థాపించారు. దర్శకుడు తేజ మొదటి సినిమా ‘చిత్రం’ ఉషా కిరణ్ బ్యానర్ లోనే వచ్చింది. ఆ మూవీతో ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఉషా కిరణ్ మూవీస్ తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల మనసులు దోచాయి. కొత్త హీరోలు, దర్శకులతో లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలు చేసేవారు రామోజీరావు. కాగా ఈ బ్యానర్ లో 100 సినిమాలు చేయాలి అనేది ఆయన కోరికట. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో 93 లేదా 95 సినిమాలు మాత్రమే తీసి ఉంటారని సమాచారం.
Also Read: Ramoji Rao: యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే… రామోజీ పరిచయం చేసిన స్టార్ హీరోలు వీరే!
వంద సినిమాలు తీయాలన్న ఆయన కోరిక తీరలేదు. రామోజీరావు తన బ్యానర్ లో 100 సినిమాలు తీయలేకపోయినా .. రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని వందల చిత్రాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అతి పెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ హబ్ గా రామోజీ ఫిల్మ్ సిటీకి పేరు ఉంది. టాలీవుడ్ టు బాలీవుడ్ అందరూ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాలు షూట్ చేస్తుంటారు. 2015లో విడుదలైన దాగుడుమూతల దండాకోర్ ఉషా కిరణ్ బ్యానర్ లో తెరకెక్కిన చివరి చిత్రం.