Ramoji Rao: ఈనాడు(Eenadu) గ్రూప్ ఫౌండర్, చైర్మన్ చెరుకూరి రామోజీరావు నేడు కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలు చుట్టుముట్టాయి. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్స్ లో జాయిన్ చేశారు. చికిత్సపొందుతూ రామోజీరావు కన్నుమూశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు, మీడియా రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. సుదీర్ఘ కాలం ఆయన ప్రస్థానం సాగింది.
రైతు కుటుంబం నుండి వచ్చిన రామోజీరావు వ్యాపారవేత్తగా ఎదిగారు. ఈనాడు పత్రిక స్థాపించారు. అనంతరం ఉషాకిరణ్ మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ… ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ పోయారు. రామోజీరావు ప్రస్థానం గురించి ఎంత చెప్పిన తక్కువే. రామోజీరావు యంగ్ టాలెంట్స్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉండేవారు. రామోజీరావు తన బ్యానర్ ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పదుల సంఖ్యలో కొత్తవారిని పరిచయం చేశాడు. వారిలో హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, చైల్డ్ ఆర్టిస్ట్స్, దర్శకులు ఉన్నారు.
Also Read: Prasanth Varma: హనుమాన్ 2 .. ఔత్సాహికులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
రామోజీరావు సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసిన వాళ్లలో కొందరు స్టార్స్ గా సిల్వర్ స్క్రీన్ ని ఏలుతున్నారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్(NTR) ని హీరోగా పరిచయం చేసింది రామోజీరావునే. హీరోగా ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని ఉషా కిరణ్ బ్యానర్ లో నిర్మించారు. దివంగత నటుడు ఉదయ్ కిరణ్(Uday Kiran) డెబ్యూ మూవీ చిత్రం. ఈ యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ని రామోజీరావు తన బ్యానర్ లో నిర్మించాడు. దర్శకుడు తేజ(Director Teja) సైతం చిత్రం మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్లకు పుల్ స్టాప్ పెడుతున్న స్టార్ హీరోయిన్…
తరుణ్(Tarun) ని చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోగా పరిచయం చేశారు రామోజీరావు. హీరోగా తరుణ్ పరిచయం అవుతూ తెరకెక్కిన నువ్వే కావాలి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒకప్పటి స్టార్ హీరో శ్రీకాంత్(Srikanth) రామోజీరావు నిర్మించిన పీపుల్స్ ఎన్ కౌంటర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. ఇష్టం మూవీతో శ్రియ శరన్(Shriya Saran), తుజే మేరీ కసమ్ చిత్రంతో జెనీలియా(Genelia), రితేష్ దేశ్ ముఖ్ లను రామోజీరావు సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రామోజీరావు పరిచయం చేసిన నటుల లిస్ట్ చాలా పెద్దదే ఉంది.