Ramoji Rao: ఒక సామాన్య మానవుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు మన ఒంట్లో శక్తి కష్టపడే తత్వం, కొంచెం నాలెడ్జ్ ను ఉపయోగిస్తే ఈ భూమ్మీద సాధించలేనిది ఏదీ లేదని యావత్ దేశానికే చాటి చెప్పిన గొప్ప వ్యక్తి రామోజీరావు… తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో గొప్ప విజయాలను అందుకున్నాడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకున్నాడు. ఈనాడు పేపర్(Eenadu paper) ద్వారా మీడియా వ్యవస్థ మొత్తానికి అధిపతి గా మారిన ఆయన మీడియా అంటే ఎలా ఉండాలి.
ఎలాంటి వార్తలను జనంలోకి తీసుకెళ్లాలి. జనాన్ని ఎలా చైతన్య పరచాలి అనే ఒక నిజాయితీతో కూడిన వార్తలను రాస్తూ మీడియాను నడిపించాడు. ఇక అలాగే సినిమా ప్రొడ్యూసర్ గా మారి చాలామంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. తరుణ్(Tarun), ఉదయ్ కిరణ్(Uday Kiran), ఎన్టీఆర్(NTR) లాంటి హీరోలను తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా పరిచయం చేసి వాళ్ళకంటూ ఒక గొప్ప గుర్తింపు తీసుకువచ్చాడు. ఇక అంతటి ఘన కీర్తిని సంపాదించుకున్న రామోజీరావు ఒక సినిమా లో అతిథి పాత్ర లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు అనే విషయం మనలో చాలా మంది కి తెలీదు. 1978లో యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ‘మార్పు'(Marpu) అనే సినిమాలో న్యాయమూర్తి పాత్రలో కొద్దిసేపు కనిపించి తన పాత్రకు న్యాయం చేయడమే కాకుండా ప్రేక్షకులను అలరించాడనే చెప్పాలి.
Also Read: Ramoji Rao: ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన రామోజీరావు… అత్యంత బాధాకరం!
ఆయన నటించింది కొద్దిసేపే అయినప్పటికీ సినిమా పోస్టర్ మీద తన ఫోటో వేయడం అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. సినిమా అంటే ఆయనకి ప్రాణం..దానికోసం ఏం చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉంటారు. ఇక అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఉదయం మనందరిని వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపోవడం అనేది ప్రతి ఒక్క సినిమా అభిమానిని తీవ్రమైన బాధకు గురి చేస్తుందనే చెప్పాలి…
Also Read: Manchu Lakshmi: మంచు లక్ష్మి విడాకుల వెనుక ఇంత తతంగం నడిచిందా?
ఇక ఈయన మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సైతం సంతాపాన్ని తెలియజేశారు. ఇక ఆయనతో ఉన్న అనుబంధాన్ని కూడా తెలియజేస్తూ ఆయన లేని లోటు తీరనిది అంటూ ఆయన గురించి తలుచుకుంటూ చాలా మంది కన్నీరు మున్నీరు అవుతున్నారు..