https://oktelugu.com/

Manchu Lakshmi: మంచు లక్ష్మి విడాకుల వెనుక ఇంత తతంగం నడిచిందా?

Manchu Lakshmi: తాజాగా మంచు లక్ష్మి మొదటి భర్త కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : June 8, 2024 / 12:43 PM IST

    Manchu Laxmi Husband

    Follow us on

    Manchu Lakshmi: తెలుగు పరిశ్రమలో మంచు లక్ష్మికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. మోహన్ బాబు(Mohan Babu) కూతురు గా ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి నటిగా, టెలివిజన్ హోస్ట్ గా రాణించారు. అయితే ఆశించిన స్థాయిలో ఆమె సక్సెస్ కాలేదు. హీరోయిన్ కావాలని ఇప్పటికి ఆమె ప్రయత్నాలు చేస్తుంది. కాగా మంచు లక్ష్మి పర్సనల్ లైఫ్ గురించి సామాన్య జనాలకు తెలిసింది తక్కువే. ముఖ్యంగా మంచు లక్ష్మి మొదటి పెళ్లి ఎందుకు ఫెయిల్ అయ్యింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అని ఎవరికీ తెలియదు.

    తాజాగా మంచు లక్ష్మి మొదటి భర్త కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంచు లక్ష్మి కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో శ్రీనివాస్(Srinivas) అనే వ్యక్తిని ప్రేమించింది. తన ప్రేమను మోహన్ బాబు అంగీకరించలేదు. దీంతో ఇంటి నుంచి ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయి సీక్రెట్ గా వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఆర్య సమాజ్ లో శ్రీనివాస్ ను పెళ్లి చేసుకుంది. అనూహ్యంగా మొదటి భర్తకు ఆమె విడాకులు ఇచ్చింది.

    Also Read: Balakrishna: బాలయ్యను కలిసిన తెలుగు టాప్ డైరెక్టర్స్…

    మంచు లక్ష్మి తన భర్తను వదులుకోవడానికి కారణం మోహన్ బాబు అట. పెళ్లైన సంవత్సరం పాటు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారట. బెదిరింపులు భరించలేక మంచు లక్ష్మి తండ్రి తో తేల్చుకోవాలని ఇంటికి వచ్చిందట. ఎంత ప్రయత్నించినా ఆమె మళ్లీ తిరిగి భర్త వద్దకు రాలేకపోయిందట.భార్య కావాలన్న శ్రీనివాస్ వేదనను ఎవరూ పట్టించుకోలేదట. ఇక చేసేది లేక .. తన భర్తకు ఇబ్బందులు రాకూడదని భావించి ఆమె విడాకులు తీసుకున్నారట.

    Also Read: Ramoji Rao: యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే… రామోజీ పరిచయం చేసిన స్టార్ హీరోలు వీరే!

    ఇక కూతురి మనసు మారుతుందని మోహన్ బాబు అమెరికా పంపారట. ఆ తర్వాత కొంతకాలానికి ఇండియా తీసుకొచ్చి ఆండీ శ్రీనివాస్ తో ఆమెకు వివాహం చేశారట. అయితే మంచు లక్ష్మి మొదటి భర్తతో ఎందుకు విడిపోయారు అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ లక్ష్మి ప్రేమకు విలన్ తన తండ్రి అనే వాదన ఉంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.