https://oktelugu.com/

‘ఆర్జీవీ మిస్సింగ్’.. అనుమానితుడిగా మెగాస్టార్..!

  వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్జీవీ మిస్సింగ్’. రాంగోపాల్ వర్మ కిడ్నాప్ కథాంశంతో ‘ఆర్జీవీ మిస్సింగ్’ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను రాంగోపాల్ వర్మ వరుసగా విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాడు. Also Read: బిగ్ బ్రేకింగ్: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి అప్ డేట్ ఇదే.. ప్రపంచంలోనే మొదటి ఫిక్షనల్ రియాలిటీ జోనర్లో ‘ఆర్జీవీ మిస్సింగ్’ మూవీ రాబోతుందట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన […]

Written By: , Updated On : October 6, 2020 / 10:38 AM IST
Follow us on

 

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్జీవీ మిస్సింగ్’. రాంగోపాల్ వర్మ కిడ్నాప్ కథాంశంతో ‘ఆర్జీవీ మిస్సింగ్’ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను రాంగోపాల్ వర్మ వరుసగా విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాడు.

Also Read: బిగ్ బ్రేకింగ్: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి అప్ డేట్ ఇదే..

ప్రపంచంలోనే మొదటి ఫిక్షనల్ రియాలిటీ జోనర్లో ‘ఆర్జీవీ మిస్సింగ్’ మూవీ రాబోతుందట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు పోస్టర్లు రిలీజయ్యారు. మొదటి పోస్టర్లో రాంగోపాల్ వర్మ చేతులకు బేడీలు వేసుకొని కన్పించాడు. ఇక రెండో పోస్టర్లో పవర్ ఫుల్ స్టార్ పీకేను పరిచయం చేసి కాంట్రవర్సీకి తెరలేపాడు. తాజాగా మూడో పోస్టర్ రిలీజ్ చేశాడు.

ఆర్జీవీ మిస్సింగ్ కేసులో రెండో నిందితుడిని చూపించాడు. ఈ పోస్టర్లో ఓ వ్యక్తి మీడియా ప్రతినిధులకు దండంపెడుతూ కన్పిస్తున్నాడు. అతడు ఎవరినైనా పోలి ఉన్నాడా అంటూ ఆర్జీవీ నెటిజన్లను ప్రశ్నించగా.. నెటిజన్లు మెగాస్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆర్జీవీ కిడ్నాప్ కేసులో మొదటి నిందితుడిగా పీకేను పరిచయం చేసిన రాంగోపాల్ వర్మ.. రెండో నిందితుడిగా మెగాస్టార్ ను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: కాజల్ అతడిపై మనసు పారేసుకుందా?

ఆర్జీవీ మిస్సింగ్ కేసులో ప్రవన్ కళ్యాణ్.. ఒమేగాస్టార్.. సీబెఎన్(CBEN).. లాకేష్.. WHY S జగన్.. KCAR.. KTAR నటిస్తున్నారని రాంగోపాల్ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మూడు పోస్టర్లు రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. పీకే.. మెగాస్టార్ పోస్టర్లతో కాంట్రవర్సీలకు తెరలేపిన రాంగోపాల్ వర్మ నేటి సాయంత్రం 5గంటలకు మరో పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ట్వీట్ చేశాడు. దీంతో రాంగోపాల్ వర్మ ఎవరినీ టార్గెట్ చేశారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.