తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. ఏందీ ‘బాబూ’ ఇదీ? 

అవును.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మన చంద్రబాబుకు అన్ని పార్టీలూ సోపతే. ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలూ టీడీపీకి మిత్రపక్షమే అనుకుంటుంటారు. అందుకే ఎన్నికలు వచ్చాయంటే ఏదో ఒక పార్టీతో జతకడుతూనే ఉంటారు. తగిన మూల్యం కూడా చెల్లించుకుంటారు అది తర్వాతి విషయం అనుకోండి. గతంలో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు దానిని శత్రువు అనుకున్నాడు. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి కాంగ్రెస్‌ దోస్తీ అంటున్నారు. ఏకంగా కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోరాడాలని అనుకుంటున్నారు. […]

Written By: NARESH, Updated On : October 6, 2020 11:20 am
Follow us on


అవును.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మన చంద్రబాబుకు అన్ని పార్టీలూ సోపతే. ఒక్క వైసీపీ తప్ప అన్ని పార్టీలూ టీడీపీకి మిత్రపక్షమే అనుకుంటుంటారు. అందుకే ఎన్నికలు వచ్చాయంటే ఏదో ఒక పార్టీతో జతకడుతూనే ఉంటారు. తగిన మూల్యం కూడా చెల్లించుకుంటారు అది తర్వాతి విషయం అనుకోండి. గతంలో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు దానిని శత్రువు అనుకున్నాడు. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి కాంగ్రెస్‌ దోస్తీ అంటున్నారు. ఏకంగా కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పోరాడాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మోడీ వల్ల దేశం నష్టపోతోంది కాబట్టి కాంగ్రెస్‌ను కలుపుకున్నామని యనమల రామక్రిష్ణుడు వంటి వారు లాజిక్‌గా మాట్లాడుతున్నారు. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పొత్తుతో బరిలోకి దిగారు తమ్ముళ్లు. కానీ.. చివరికి ఈ పొత్తుని జనం పక్కన పెటేశారు. కేసీయార్ ని రెండో సారి గెలిపించారు.

Also Read: ‘అమరావతి’పై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

ఎలాగూ.. తెలంగాణలో ఏ ఆశలు లేకుండా పోయిందని ఇక కాంగ్రెస్‌ పేరు కూడా ఎత్తడం లేదు. దీనికితోడు ఇప్పుడు ఏపీలోనూ పదవి ఊడిపోవడంతో మరింత జాగ్రత్త పడుతున్నాడు చంద్రబాబు. అందుకే.. కేంద్రంలో ఉన్న బీజేపీ వైపు ఆసక్తిగా చూస్తున్నారట. ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం తాము చంద్రబాబు వల్లే ఓడామని అంటున్నారు. చంద్రబాబు ఆంధ్రా రాజకీయాల వల్ల తమ ఓటు బ్యాంక్ కూడా గల్లంతైందని చింతిస్తున్నారు. చంద్రబాబుతో మళ్లీ ఎటువంటి స్నేహం ఉండదని తేల్చేస్తున్నారు. 2023 నాటి ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీకి కాంగ్రెస్ రెడీ అవుతుందట.తెలంగాణ టీడీపీని కాంగ్రెస్‌ దూరం పెడుతుంటే.. ఏపీలో దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందట. అందుకే టీడీపీ నోట్లో నుంచి వచ్చిన మాటలనే పీసీసీ చీఫ్ శైలజానాథ్‌ వల్లె వేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు అంటూ ఆయన హైకోర్టులో కాంగ్రెస్ తరఫున వాదనను వినిపిస్తున్న అఫిడవిట్ ఇచ్చారు. అమరావతి రాజధానిని కాంగ్రెస్ స్వాగతించిందని చెప్పుకున్నారు. అమరావతిలో పదివేల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున నిర్మాణం పనులు సాగుతున్నాయట. అందువల్ల రాజధానిని అసలు కద‌పవద్దని కాంగ్రెస్ తరఫున అఫిడవిట్‌ను ఆయన దాఖలు చేశారు. ఓ విధంగా దీన్ని చూస్తే చంద్రబాబు వాదనే గుర్తుకొస్తోంది. బాబుకు బలమైన మద్దతు కాంగ్రెస్ నుంచి ఈ విధంగా లభించినట్లైంది.

Also Read: జగన్ కేంద్రంలో చేరితే పవన్ కళ్యాణ్ ఎక్కడ?

ఇక ఏపీలో 2024 నాటికి బీజేపీ పలకకపోతే చంద్రబాబుకు కాంగ్రెస్, వామపక్షాలే దిక్కు. గత ఎన్నికల్లో అయితే.. నోటా కన్నా వెనుకబడిపోయాయి కాంగ్రెస్‌, బీజేపీలు. మొత్తం ఆరు శాతం ఓట్లను జనసేన ఖాతాలో పవన్ కళ్యాణ్ తెలివిగా వేసుకుంది. ఎంత కాదనుకున్నా అర శాతం ఓట్లయినా వామపక్షాలకు ఉంటాయి కదా. అలా చంద్రబాబుకు కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు వల్ల నియోజకవర్గానికి వందా రెండు వందల ఓట్లు అయినా తెస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక టీడీపీతో పొత్తు తప్ప మరో పార్టీ కాంగ్రెస్ కి కూడా ఏపీలో కనిపించడంలేదు. దాంతోనే శైలజానాథ్‌ జై అమరావతి అంటూ చంద్రబాబు బాటన నడుస్తున్నారని చెబుతున్నారు. ఏంటో ఈ ఏపీలో ఏరోజు ఏ పొత్తు పొడుస్తుందో తెలియకుండా ఉంది. ఇప్పటి నుంచే ఫ్యూచర్‌‌ ఎన్నికల కోసం ప్లాన్‌ చేస్తున్నట్లుంది.