దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ నుంచి అప్ డేట్ బయటకొచ్చింది.. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ నిత్యం ఏదో ఒక అప్డేట్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటోంది. కానీ కరోనా కారణంగా ఆరేడు నెలలుగా ఏ అప్డేట్ లేకుండా ఆర్ఆర్ఆర్ టీం వెలవెలబోయింది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ కీలక అప్ డేట్ వచ్చింది. అది అభిమానుల్లో ఫుల్ జోష్ ను నింపింది.
Also Read: కాజల్ అతడిపై మనసు పారేసుకుందా?
షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి ఈరోజు ఆర్ఆర్ఆర్ నుంచి అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు.. ఈ మేరకు ‘ఆర్ఆర్ఆర్’ ట్వీట్ చేసింది.
ఆ అప్ డేట్ ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ను మళ్లీ మొదలు పెట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసింది.
చిత్రీకరణ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నామని తెలిపింది. ఇక చివరగా జూనియర్ ఎన్టీఆర్ (కొమురం భీం) లుక్ ను ఈనెల 22న విడుదల చేయనున్నట్టు చిత్రం యూనిట్ ప్రకటించింది. దీంతో కొమురం భీం లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అల్లూరి సీతరామరాజుగా రాంచరణ్.. కొమురంభీంగా ఎన్టీఆర్ కన్పించబోతున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న సమయంలో కరోనాతో సినిమా వాయిదా పడింది. ఈ మూవీ షూటింగు ప్రారంభిస్తారని అనుకున్న సమయానికి దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కరోనా బారిన పడ్డారు.
దీంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇటీవల వీరంతా కరోనా నుంచి కోలుకున్నారు.
Also Read: ‘ఆర్జీవీ మిస్సింగ్’.. అనుమానితుడిగా మెగాస్టార్..!
కాగా ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభమైందని ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్ చేసింది.. ఇందులో రాంచరణ్, ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని సమాచారం.
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ చేసే ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజేషన్ చేయించడం.. థర్మల్ స్ర్కీనింగ్ ద్వారా నటీనటుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నటీనటుల క్వారంటైన్ పీరియడ్ పూర్తయ్యాకే సినిమా షూటింగ్ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కోవిడ్ నిబంధనలతో షూటింగ్ స్ట్రాట్ అయ్యింది.