‘హీరో రామ్’ హీరోగా మారి పదిహేను సంవత్సరాలు అవుతున్నా.. పైగా మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ వచ్చినా ఇప్పటికీ స్టార్ హీరో మాత్రం కాలేకపోయాడు. ‘విజయ్ దేవరకొండ’ లాంటి హీరో రేంజ్ మార్కెట్ ను కూడా సాధించలేకపోయాడు. అయితే, ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది అని రామ్ ఫ్యాన్స్ ఆశించేలోపే, మళ్ళీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
‘రెడ్’ అంటూ డిజాస్టర్ ను అందుకున్నాడు. దాంతో పదుల సంఖ్యలో కథలు విని చివరకు మూడు కథలు ఓకే చేశాడు. నిన్న తన బర్త్ డే. పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలు అనౌన్స్ చేయాలని భావించిన రామ్, ఆ తరువాత తన ప్లాన్ ను మార్చుకున్నాడు. ఈ కరోనా రెండో వేవ్ అనేది మరో మూడు నెలలు ఉంటుంది. ఎలాగూ లింగుస్వామి సినిమా పట్టాలెక్కించాడు.
ఇప్పుడు మళ్ళీ మరో రెండు సినిమాలు అంటే.. ఈ కరోనా టైంలో కుదిరే పని కాదు, అందుకే వాటిని పోస్ట్ ఫోన్ చేశాడు. ఎలాగూ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వచ్చే ఏడాది వరకు అనిశ్చితి ఉంటుంది. మార్కెట్ మళ్ళీ పుంజుకోవాలి అంటే.. ఎక్కువ టైమ్ పట్టే అవకాశం ఉంది. పైగా ఆగిపోయిన సినిమాలన్నింటికీ డేట్స్ దొరకడం కూడా కష్టమే. అన్నిటికి మించి అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ విషయంలో పోటీ పడాలి.
ఆ పోటీలో పొరపాటున రెండు ప్లాప్ లు వస్తే.. ఇక ఉన్న మార్కెట్ కూడా పోతుంది. నాని లాంటి హీరోలు చేసిన పొరపాటు ఇదే. వరుసగా సినిమాలు చేసి ఉన్న మార్కెట్ ను ఎందుకు పోగొట్టుకోవడం అనే ఆలోచనలో ఉన్నాడు రామ్. అందుకే జులై నుంచి లింగుస్వామి డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ చేసి, అది పూర్తి చేసిన తరువాతే తన మిగిలిన సినిమాల గురించి ఆలోచిస్తాడట. మొత్తానికి నిధానమే ప్రధానం అనేలా రామ్ జర్నీ సాగుతుంది.