నన్ను అరెస్ట్ చేయండి మోడీ: రాహుల్ సంచలన పోస్టర్

దేశంలో వ్యాక్సిన్ల కొరతను ప్రశ్నిస్తూ.. మొదట వ్యాక్సిన్లను విదేశాలకు పంచిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా దేశ రాజధానిలో పోస్టర్లు అంటించిన 17మందిని తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వానికి సవాల్ చేశాడు. దమ్ముంటే తాను కూడా ఆ పోస్టర్లను షేర్ చేస్తున్నానని.. తనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోస్టర్‌ను ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ సవాల్ చేశాడు. […]

Written By: NARESH, Updated On : May 16, 2021 4:54 pm
Follow us on

దేశంలో వ్యాక్సిన్ల కొరతను ప్రశ్నిస్తూ.. మొదట వ్యాక్సిన్లను విదేశాలకు పంచిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా దేశ రాజధానిలో పోస్టర్లు అంటించిన 17మందిని తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వానికి సవాల్ చేశాడు. దమ్ముంటే తాను కూడా ఆ పోస్టర్లను షేర్ చేస్తున్నానని.. తనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోస్టర్‌ను ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ సవాల్ చేశాడు. “నన్ను కూడా అరెస్ట్ చేయండి.” అని కామెంట్ ను జతపరిచాడు.

మోడీని వ్యాక్సిన్లపై ప్రశ్నించినందుకు 17మందిని అరెస్ట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. దీంతో రాహుల్ సహా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ఈ మేరకు ప్రచారం హోరెత్తిస్తున్నారు.

కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఇలా ట్వీట్ చేశారు. “విచ్ఛిన్నమైన ప్రభుత్వం నుండి ప్రజలకు అంచనాలు ఉన్నాయి. వారికి కావాలసిన కనీస కోరికలు తీరనప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఎవరినైనా ప్రశ్నిస్తారు.’ అని ఆయన అరెస్ట్ లను ఖండించారు. “ప్రజలు తమ వ్యాక్సిన్లను ఎందుకు పక్క దేశాలకు పంచారు. అనే ప్రశ్న ఎందుకు అడగకూడదు” అని ఆయన ప్రశ్నించారు.

మోడీని ప్రశ్నించి పోస్టర్లు అంటించినందుకు ఢిల్లీ పోలీసులు డజను మందికిపైగా అరెస్టు చేసినట్లు శనివారం తెలిపాయి. కోవిడ్ -19 వ్యాక్సిన్లను దేశ ప్రజల అవసరాలను తీర్చడానికి బదులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారని ప్రధానిని విమర్శిస్తూ బ్లాక్ కలర్ లో వారు పోస్టర్లు పెట్టడం అరెస్ట్ కు కారణమైంది. ఢిల్లీలోని షాహదారా, రోహిణి, రిథాలా, ద్వారకా మరియు ఇతర ప్రదేశాలలో ఈ పోస్టర్లు వేశారు.

బుద్ విహార్ వార్డ్ కౌన్సిలర్ గాయత్రీ గార్గ్ కూడా దీనిపై ప్రశ్నించారు. “మే 12 న బుద్ విహార్, విజయ్ విహార్ మరియు ఇతర ప్రాంతాలలో అనేక పోస్టర్లు మోడీకి వ్యతిరేకంగా అంటించినట్లు మాకు సమాచారం వచ్చింది. సమాచారం తరువాత, నేను నా భర్తతో పాటు అనేక ఇతర సభ్యులను తీసుకెళ్లి మే 13న వాటిని తొలగించాం. ” అని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ప్రధానికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన కేసులో పోలీసులు 17 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టడాన్ని షాహదరా ప్రాంతంలోసిసిటివి ఫుటేజీ కూడా లభ్యమైంది. ఈ మేరకు సాక్ష్యాలతోనే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతర వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. మూడు పోస్టర్లు అంటుకున్నందుకు ప్రజలకు షాదారా ప్రాంతంలో రూ.500 చెల్లించినట్లు కూడా పోలీసులు గుర్తించారు.

మొత్తంగా మోడీకి వ్యతిరేకంగా వ్యాక్సిన్లు ఇమ్మని పోస్టర్లు అంటించిన 17మంది జైలు పాలయ్యారు. ఇప్పుడు రాహుల్ గాంధీసైతం ఏంత తన డీపీనే ఆ పోస్టర్ గా పెట్టుకొని తనను కూడా అరెస్ట్ చేయమని సవాల్ చేశాడు.