వైసీపీ ఎంపీ కోసం చంద్రబాబు ఉద్యమం

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో చంద్రబాబు తలదూర్చడంపై పలు విమర్శలు వస్తున్నాయి. రెబల్ గా మారిన కృష్ణం రాజు ఏడాదిగా సొంత పార్టీ వైసీపీ పైనే విమర్శలు చేస్తూ రచ్చ చేశారు. దీంతో వైసీపీ ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ట్విటర్లో హ్యాష్ ట్యాగ్ పెట్టి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. దీంతో ఏపీలో అసలేం జరుగుతోందని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. సొంత పార్టీ కాకపోయినా.. […]

Written By: NARESH, Updated On : May 16, 2021 5:21 pm
Follow us on

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో చంద్రబాబు తలదూర్చడంపై పలు విమర్శలు వస్తున్నాయి. రెబల్ గా మారిన కృష్ణం రాజు ఏడాదిగా సొంత పార్టీ వైసీపీ పైనే విమర్శలు చేస్తూ రచ్చ చేశారు. దీంతో వైసీపీ ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేయించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ట్విటర్లో హ్యాష్ ట్యాగ్ పెట్టి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. దీంతో ఏపీలో అసలేం జరుగుతోందని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

సొంత పార్టీ కాకపోయినా..
రఘురామ కృష్ణం రాజు సొంత పార్టీ నాయకుడు కాకపోయినా టీడీపీ స్పందనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రఘురామ అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండిస్తూ ట్విటర్లో పోస్టు చేయడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. సోసల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ తమ పని మానేసి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారని చెబుతున్నారు.

రఘురామపై ఎందుకంత ప్రేమ
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో చంద్రబాబు అనవసరంగా కలుగజేసుకుంటున్నారని వైసీపీ వర్గాలు విమర్శలు చేస్తుంది. అయినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. రాష్ర్టంలో ప్రజాస్వామ్య పాలన లేదంటూ ప్రతి విమర్శలు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. తమ పార్టీ కాకపోయినా రఘురామపై టీడీపీ ఎందుకంత ప్రేమ ఒలకబోస్తుందని విమర్శలు చేస్తోంది.

ఎక్కడికి వెళ్తుందో..
రఘురామ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందోనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి తోచిన విషయాలు వారు చేస్తారని తెలిసిందే. కానీ రఘురామ విషయంలో ఇరు పార్టీల నేతలు తమ విమర్శలకు ఎక్కుపెడుతున్నారు. మా పార్టీ ఎంపీపై వారికెందుకని వైసీపీ నేతలు అంటుంటే ప్రజాస్వామ్య పాలనలో ఇంత అన్యాయమా? ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ టీడీపీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈతతంగంపై ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఎవరికి తోచిన విధంగా వారు విమర్శలు చేస్తున్నారు. చిలికి చిలికి గాలివానగా మారిన వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాల్సిందే.