Ram Nagar Bunny: బుల్లితెర మీద యాంకర్ గా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సక్సెస్ ఫుల్ కెరీర్ ని కొనసాగించి, తనకంటూ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు ప్రభాకర్. ఈయనని అందరూ బుల్లితెర మెగాస్టార్ అని పిలుస్తూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా ఈయన అప్పుడప్పుడు పాల్గొంటూ సందడి చేయడం వంటివి మనమంతా చూస్తూనే ఉన్నాం. అలా కోట్లాది మంది జనాలకు సుపరిచితుడైన కొడుకు గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు ఆయన తనయుడు చంద్రహాస్. అయితే ఎంత పెద్ద స్టార్ కొడుకు అయినా, జనాలకు తొలిచూపులోనే నచ్చాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, ప్రవర్తన కూడా బాగుండాలి. ఆ ప్రవర్తన బాగాలేకపోవడం వల్లే చంద్రహాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రామ్ నగర్ బన్నీ’ కి కనీసం ప్రొమోషన్స్ కోసం చేసిన ఖర్చులు కూడా రాలేదు. మొదటి సినిమా ముహూర్తం సమయంలో చంద్రహాస్ తనలోని యాటిట్యూడ్ ని చూపిస్తూ పెద్దలను కూడా లెక్క చేయకుండా అటు ఇటు చూసే వీడియో అప్పట్లో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
ఇంత యాటిట్యూడ్ అవసరం లేదు, ఇండస్ట్రీ లో దశాబ్దాలుగా సూపర్ స్టార్స్ గా కొనసాగిన చిరంజీవి, నాగార్జున కొడుకులు కూడా ఈ రేంజ్ బిల్డప్ ఇవ్వలేదు అంటూ నెటిజెన్స్ ఇష్టమొచ్చినట్టు తిట్టారు. అయితే దీనిని చాలా పాజిటివ్ గా తీసుకున్న చంద్ర హాస్, ‘యాటిట్యూడ్ స్టార్’ గా తన పేరుని మార్చేసుకున్నాడు. ఇది జనాలకు ఇంకా అతిగా అనిపించింది. అందుకే ఆయన మొదటి సినిమాకి ఇలాంటి గతి పట్టించారు. అక్టోబర్ 4 వ తేదీన విడుదలైన ‘రామ్ నగర్ బన్నీ’ చిత్రానికి 6 రోజులకు గానూ కనీసం 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదట. ఇక షేర్ ఏమాత్రం వచ్చి ఉంటాడో ఊహించుకోవచ్చు. ఈ సినిమాని ప్రభాకర్ నిర్మించాడు. దాదాపుగా 2 నుండి 3 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసాడు. అంతే కాకుండా ప్రొమోషన్స్ కోసం మరో 50 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసాడు. కానీ వాటికోసం చేసిన ఖర్చులను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. దీంతో ప్రభాకర్ అప్పుల పాలయ్యాడు.
ఆయన రీసెంట్ గానే ఈటీవీ లో ‘కృష్ణ..ముకుంద..మురారి’ సీరియల్ తో భారీ హిట్ అందుకున్నాడు. ఈ సీరియల్ కి ఆయన నిర్మాత. టీఆర్ఫీ రేటింగ్స్ భారీగా రావడంతో ఈ సీరియల్ ద్వారా ప్రభాకర్ భారీగానే లాభాలను అర్జించాడు. అలా వచ్చిన లాభాలను ఈ సినిమాతో పోగొట్టుకున్నాడు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు కుర్రాడు మంచి హుషారుగానే ఉన్నాడే, బయట అతి చేసిన పర్వాలేదు, టాలెంట్ ఉంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎంతైనా ఒక్కసారి ఆడియన్స్ లో నెగటివ్ అభిప్రాయం ఏర్పడితే దానిని మార్చడం చాలా కష్టం. మొదట ఏర్పడిన అభిప్రాయం ఎప్పటికీ చెరిగిపోదు అని పెద్దలు అంటుంటారు, అది చంద్రహాస్ విషయంలో నిజమైంది.