https://oktelugu.com/

Bigg Boss Telugu 8: చేతులు కట్ చేసుకున్న విష్ణు ప్రియ.. ఓవర్ యాక్షన్ తో రెచ్చిపోయిన పృథ్వీ..వీళ్ళ రొమాన్స్ కి లిమిట్ లేదా!

మొదటి రెండు వారాల్లో ఈమె నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు నిఖిల్ ని సైతం డామినేట్ చేసే స్థాయిలో ఉండేది. కానీ ఆ తర్వాత ఈమె ఆట మీద కంటే తన ఫోకస్ ని ఎక్కువగా పృథ్వీ వైపుకు షిఫ్ట్ చేయడంతో ఓటింగ్ మొత్తం ఢమాల్ అంటూ పడిపోయింది. అయితే హౌస్ లో ఈమె ఎలాంటి డ్రామాలు చేయడం లేదు, తానూ ఎలా అయితే ఉండాలని అనుకుంటుందో, అలాగే ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 10, 2024 / 11:42 AM IST

    Bigg Boss Telugu 8(104)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో ఎక్కువ శాతం కొత్త వాళ్ళు అవ్వడం, వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలోనే పాపులర్ అవ్వడం వల్ల వాళ్లకు ప్రీ ఫ్యాన్ బేస్ ఉండడం చాలా తక్కువ. వారిలో హౌస్ లో అడుగుపెట్టకముందు నుండే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది విష్ణు ప్రియ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. మొదటి రెండు వారాల్లో ఈమె నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు నిఖిల్ ని సైతం డామినేట్ చేసే స్థాయిలో ఉండేది. కానీ ఆ తర్వాత ఈమె ఆట మీద కంటే తన ఫోకస్ ని ఎక్కువగా పృథ్వీ వైపుకు షిఫ్ట్ చేయడంతో ఓటింగ్ మొత్తం ఢమాల్ అంటూ పడిపోయింది. అయితే హౌస్ లో ఈమె ఎలాంటి డ్రామాలు చేయడం లేదు, తానూ ఎలా అయితే ఉండాలని అనుకుంటుందో, అలాగే ఉంటుంది. టాస్కులు ఇచ్చినప్పుడు తన బెస్ట్ ట్రై చేస్తుంది.

    కానీ ఆమెలో గెలవాలనే కోరిక, కప్ కొట్టాలనే కోరిక లేదు. ఆడియన్స్ ఎన్ని రోజులు హౌస్ లో ఉంచితే అన్ని రోజులు ఉంటాను, లేదంటే ఎలిమినేట్ అయిపోతాను అనే తీరుతో ఆమె బిగ్ బాస్ జర్నీ కొనసాగుతుంది. కానీ ఈమె ఒక్క వారం అయినా కసిగా తన గేమ్ ని ఆడితే కచ్చితంగా టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పృథ్వీ హౌస్ లో ఉన్నన్ని రోజులు అది అసాధ్యం అని తెలుస్తుంది. ఈమెకు పృథ్వీ అంటే ఎంత పిచ్చి అనేది షో ని లైవ్ లో చూసేవాళ్లకు అర్థం అవుతుంది. హౌస్ లో 24 గంటలు అతని చుట్టూనే తిరుగుతుంది. ఒక అమ్మాయి అయ్యుండి ఎందుకు ఇలా అతని వెంటపడుతుంది, ఆత్మగౌరవం లేదా అని తోటి అమ్మాయిలు కూడా ఈమెను చూసి అనుకుంటున్నారు. ఇది ఆమెకు ఓటింగ్ లో చాలా మైనస్ అవుతుంది. ఉదాహరణకు నిన్నటి ఎపిసోడ్ లో ఈమె చేతి చూపుడు వేలు చిన్నగా కట్ అవుతుంది.

    ఇది పృథ్వీ కి వెళ్లి చెప్పగా, అతను విష్ణు పై కేరింగ్ చూపిస్తూ ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. ఈ మాత్రానికే విష్ణు ప్రియ పొంగిపోయి అతని పై ముద్దుల వర్షం కురిపిస్తుంది. పృథ్వీ విష్ణు ప్రియ ని సాధ్యమైనంత వరకు దూరం పెట్టాలనే చూస్తున్నాడు. అది విష్ణు ప్రియ కి కూడా అర్థమైంది, అయినప్పటికీ కూడా అతని వెంటనే తిరగడం, అతను ఈమెకు చిన్న సహాయం చేసిన ముద్దులు పెట్టడం వంటివి చూసి ఈమెని అభిమానించే వారికి కూడా చిరాకు వచ్చేసింది. అందుకే ఈమె ఓటింగ్ ప్రతీ వారం దిగజారుతూ వెళ్తుంది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఈమెకు బయట ఎలా జరుగుతుంది అనే విషయం పై చిన్న హింట్స్ కూడా ఇచ్చారు, అయినప్పటికీ కూడా ఈమె తన గేమ్ ని మార్చుకోలేదు. ఇలాగే కొనసాగితే వచ్చే వారం ఈమె ఎలిమినేట్ అవ్వడం పక్కా అని అంటున్నారు విశ్లేషకులు.