MLC Duvvada Issue : ఆమెకు 32 సంవత్సరాలు.. ఆయన 55 ప్లస్.. ఇద్దరికీ వివాహాలు జరిగాయి. ఆమెకు భర్త ఉన్నాడు.. ఈయనకు భార్య ఉంది. ఆపై పిల్లలు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు వారు పెళ్లికి సిద్ధపడుతున్నారు. ఒక కుమారుడిని కనాలని భావిస్తున్నారు. అలా పుట్టిన కుమారుడికి తమ అభిమాన నేత పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇలా నిర్ణయించుకున్నది ఎవరో తెలుసా? దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట. ప్రస్తుతం ఈ జంట రిలాక్స్ మోడ్ లో ఉంది. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ హీరోగా వాలంటీర్ అనే సినిమా యూట్యూబ్ ఛానల్ లో విడుదలైంది. మధ్య మధ్యలో ఈ జంట రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో విడుదల చేస్తోంది. రెండు రోజుల కిందట తిరుమలలో ప్రత్యక్షమైంది ఈ జంట. వీరిని చూపిస్తే వ్యూస్ పెరగడంతో టీవీ ఛానళ్లు ఆహ్వానిస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు వారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తున్నాయి.నిర్మొహమాటంగా తమ మనసులో ఉన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి.
* అలా ముగిసింది
దాదాపు నెల రోజులపాటు దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ నడిచింది. మా నాన్న వేరే మహిళతో ఉంటున్నారని ఆరోపిస్తూ ఇద్దరు కుమార్తెలు ముందుగా దువ్వాడ కొత్త ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే వారికి ఎంట్రీ లేకపోవడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి దువ్వాడ శ్రీనివాస్ భార్య నిరసన శిబిరాన్ని కొనసాగించారు. సుదీర్ఘకాలం ఎన్నో ట్విస్టులు, ఎపిసోడ్లతో ఇది కొనసాగింది. చివరకు ఎన్నికలకు ముందు రుణం పేరిట తీసుకున్న రెండు కోట్ల మొత్తానికి గాను మాధురికి ఆ ఇంటిని రాసిచ్చారు దువ్వాడ శ్రీనివాస్. దీంతో దువ్వాడ వాణి ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది.
* నెటిజెన్లు భిన్న కామెంట్స్
ప్రస్తుతం టీవీ ఛానల్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్, మాధురి జంట. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో అయితే నర్మగర్భంగా మాట్లాడారు. పెళ్లి చేసుకొని కుమారుడిని కంటామని తేల్చి చెప్పారు. అలా పుట్టిన కుమారుడికి జగన్ అని పేరు పెడతామని కూడాప్రకటించారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో కొత్త ప్రచారం ప్రారంభమైంది. ఓరి నీ దుంప తెగ ఎంతకు తెగించారు రా అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. సరిపోయారు.. ఆ నేతకు తగ్గ అనుచరులు అంటూ వ్యాఖ్యానించిన వారు ఉన్నారు.