Ram Charan Sukumar movie Heroine: రంగస్థలం వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్(Global Star Ram Charan) , సుకుమార్(sukumar) కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కబోతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ‘పెద్ది'(Peddi Movie) తర్వాత రామ్ చరణ్ చెయ్యబోయే సినిమా ఇదే. చాలా కాలం నుండి డైరెక్టర్ సుకుమార్ దుబాయి లో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా ఉన్నాడు. స్క్రిప్ట్ ని పూర్తి కూడా చేసాడు. కానీ ఎందుకో ఆయనకు అది ది బెస్ట్ అనిపించలేదు. ఇంకా గొప్ప ఐడియా రావడం తో దానిని డెవలప్ చేస్తూ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన రైటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఆ పనిలోనే ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే దానిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
రష్మిక ని డైరెక్టర్ సుకుమార్ మరోసారి హీరోయిన్ రోల్ కోసం సంప్రదించినట్టు వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదట. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే , కృతి సనన్ ని ఈ చిత్రం లో హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో టాప్ హీరోనే గా కొనసాగే ఈమెకు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఒక స్టార్ హీరోకి ఉన్నంత బ్రాండ్ ఇమేజ్ ఈమె సొంతం. పైగా ఈమె ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అయితే బాలీవుడ్ లో ఈమె పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యుండొచ్చు, కానీ టాలీవుడ్ లో మాత్రం ఈమె డిజాస్టర్ హీరోయిన్ . డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ చిత్రం ద్వారానే ఈమె హీరోయిన్ గా వెండితెర కు పరిచయం అయ్యింది. ఆ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read: చెప్పిన తేదీ కంటే ముందే రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’..కొత్త విడుదల తేదీ ఏంటంటే!
ఈ సినిమా తర్వాత తెలుగు లో ఆమె నాగ చైతన్య తో కలిసి ‘దోచేయ్ ‘ అనే చిత్రం చేసింది. ఇది కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ . ఇలా వరుసగా టాలీవుడ్ లో రెండు భారీ డిజాస్టర్స్ ని అందుకున్న హీరోయిన్ తో సినిమా చేయడం అవసరమా ?, బాలీవుడ్ లో కూడా ఆమెకు సక్సెస్ శాతం ఎక్కువ లేదు , ఫ్లాప్స్ ఎక్కువ అంటూ చెప్పుకొస్తున్నారు. పైగా రామ్ చరణ్ పక్కన కృతిః సనన్ పెద్ద వయస్సు ఉన్న అమ్మాయిలాగా అనిపిస్తుందని, ఆమెని ఈ చిత్రం లోకి తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. రుక్మిణి వాసంత్ , కియారా అద్వానీ లాంటి యంగ్ హీరోయిన్స్ ని తీసుకుంటే బెటర్ అని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.