Homeఎంటర్టైన్మెంట్Sivaji 1800 crore loss: 1800 కోట్ల రూపాయిలు నష్టపోయిన హీరో శివాజీ.. కారణం ఏంటంటే!

Sivaji 1800 crore loss: 1800 కోట్ల రూపాయిలు నష్టపోయిన హీరో శివాజీ.. కారణం ఏంటంటే!

Sivaji 1800 crore loss: ఒకప్పుడు హీరో గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో శివాజీ, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే మధ్యలో రాజకీయ అరంగేట్రం చేసి సినిమాలకు చాలా రోజులు దూరం అయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత ‘బిగ్ బాస్ 7’ లోకి అడుగుపెట్టిన శివాజీ , ఎలాంటి క్రేజ్ ని సంపాదించుకున్నాడో […]

Sivaji 1800 crore loss: ఒకప్పుడు హీరో గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో శివాజీ, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే మధ్యలో రాజకీయ అరంగేట్రం చేసి సినిమాలకు చాలా రోజులు దూరం అయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత ‘బిగ్ బాస్ 7’ లోకి అడుగుపెట్టిన శివాజీ , ఎలాంటి క్రేజ్ ని సంపాదించుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో శివాజీ లాంటి మాస్టర్ మైండ్ గేమర్ ఎవ్వరూ లేరని అనిపించుకున్నాడు. ‘బిగ్ బాస్ 7’ నుండి బయటకు వచ్చిన తర్వాత శివాజీ రేంజ్ వేరు . బయటకు వచ్చిన తర్వాత ఆయన నుండి విడుదలైన 90’s వెబ్ సిరీస్ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆయన నటించిన ‘కోర్టు ‘ చిత్రం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.

నేటి తరం ఆడియన్స్ శివాజీ ని మంగపతి గానే గుర్తుపెట్టుకున్నారు. ఆ రేంజ్ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఇక రీసెంట్ గా శివాజీ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు ఆయన క్రేజ్ ని మరింత పెంచేలా చేశాయి. ఇకపోతే చాలా కాలం తర్వాత శివాజీ హీరో గా నటిస్తూ చేసిన చిత్రం ‘సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసని’. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. సీనియర్ హీరోయిన్ లయ ఇందులో శివాజీ కి జోడిగా నటించింది. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ తెరకెక్కిన ‘మిస్సమ్మ’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రాలు కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయో మన అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈనెల 6వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

Also Read: రామ్ చరణ్ , సుకుమార్ మూవీ లో డిజాస్టర్ హీరోయిన్..భయపడుతున్న ఫ్యాన్స్!

ఈ ఈవెంట్ లో హీరో శివాజీ తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను సినిమాలకు దూరమైనా తర్వాత జీవనాధారం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం లోకి దిగాను. అలా యాదిగిరిగుట్టలో ఒకప్పుడు ఎకరం 70 వేలకు కొన్న ఒక ఫ్లాట్ నా దగ్గర ఉండేది. దానిని నేను ఒక్కో ఎకరాన్ని 9 లక్షల రూపాయలకు అమ్మేశా. ఇప్పుడు దాని ధర ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోయింది. హైద్రాబాద్లోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఇలాగే 18 ఎకరాలను తక్కువ లాభాలకు అమ్మేశాను. అక్కడ ఇప్పుడు ఒక్కో ఎకరం 100 కోట్ల రూపాయలకు పలుకుతుంది. అంటే అక్షరాలా 1800 కోట్లు. ఎంత నష్టపోయానో మీరే చూడండి. ఒక్క ఎకరం అయినా ఉంచుకోవాల్సింది, చాలా పెద్ద తప్పు చేసానని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper