Suzuki e Access rental plan: Royal Brothers Bike Rentals గురించి బెంగళూరులో ఉండే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టూవీలర్ బైక్స్ అద్దెకు ఇవ్వడానికి ఇది పనిచేస్తుంది. 24 గంటల నుంచి ఏడాది పాటు వరకు ఈ సంస్థ నుంచి బైక్స్ అద్దెకు తీసుకోవచ్చు. ఈ సంస్థలో స్కూటర్లు, మిడ్ రేంజ్ బైక్స్ కనిపిస్తాయి. అయితే ఇటీవల ఈ సంస్థ తన భాగస్వామ్యంలో సుజుకి కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా చేర్చుకుంది. ఇందులో ఉండే ఇంజన్ సామర్థ్యంతో అత్యధికంగా మైలేజ్ ఇవ్వనుంది. దీంతో ఈ స్కూటర్లు అద్దెకు ఇవ్వడానికి బాగా సరిపోతాయని భావిస్తుంది. సుజుకి కంపెనీ యాక్సెస్ పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ స్కూటర్లు అద్దెకు ఇవ్వడానికి ఉపయోగపడుతున్నాయి అంటే.. ఇందులో ఉండే స్మార్ట్ ఫీచర్స్, ఇంజన్ పనితీరు గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఎలా ఉన్నాయంటే..?
Suzuki కంపెనీకి చెందిన e Access ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యంత ఆదరణ పొందుతోంది. ఇందులో 3.07 kWh బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఇది 4.1 kW పవర్ తో పాటు 15 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. దీని ఛార్జింగ్ 80 శాతం పూర్తికావడానికి గంట 12 నిమిషాలు పడుతుంది. అంతేకాకుండా ఈ స్కూటర్లలో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అండర్ బోన్ ఫ్రేమ్, అలాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ట్యూబ్ లెస్ టైర్లు, టెలిస్కోపిక్ ఫ్రంటు పార్క్, సింగ్ ఆర్మ్ టైప్ రియర్ స్ప్రింగ్ సస్పెన్షన్ వంటివి ఉన్నాయి. అలాగే LED హెడ్ లాంప్స్ తో ఆగసినియంగా కనిపిస్తాయి.
Also Read: పదేళ్లలో 14 లక్షల కార్ల విక్రయాలు..SUV అంటే ఇదే అంటున్న కస్టమర్లు..
ఇప్పటికే మార్కెట్లో ఉన్న TVS కంపెనీకి చెందిన బజాజ్ ఆటో, either ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ వంటి బైక్ లకు సుజుకి యాక్సెస్ ఈ స్కూటర్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అద్దె కోసం కూడా ఈ స్కూటర్ ఉపయోగపడుతుందంటే దీని ఆదరణ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది దీర్ఘకాలంలో ఈ బైక్ కావాలని అనుకునేవారు వెంటనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కానీ అంతకుముందే రాయల్ బ్రదర్స్ వీటిని అద్దెకు ఇవ్వడం ప్రాముఖ్యత సాధించింది. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.1.88 లక్షల ధరతో ఉంది. అయితే దీనిని కొనకుండానే రెంటు ప్లాన్ లో రైడ్ చేయవచ్చు..
అయితే ఈ స్కూటర్లో ఉండే స్మార్ట్ టెక్నాలజీ కూడా కొనుగోలు పెరిగేందుకు అవకాశం గా ఉన్నాయి. ఇందులో కీలెస్ ఆపరేషన్, డ్రైవ్ మోడ్ సెలెక్టెడ్, USB చార్జింగ్ పోర్టు, కలర్ TFT డిస్ప్లే, హజార్డు స్విచ్ ఆన్సర్ బ్లాక్ ఫంక్షన్ వంటివి ఉన్నాయి. అయితే మిగతా స్కూటర్ల కంటే దీని ధర ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇందులో ఉండే ఇంజన్ తో పాటు మైలేజ్ విషయం మిడ్ రేంజ్ పీపుల్స్ కు అనుగుణంగా ఉండడంతో చాలామంది దీనిని కోరుకుంటున్నారు.