Upasana Birthday: అపోలో ఆస్పత్రి నిర్వాహకురాలు, నటుడు రాంచరణ్ భార్య ఉపాసన జన్మదిన వేడుకలు నిన్న జరిగాయి. 33వ ఏట అడుగుపెట్టిన ఉపాసనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమైన వారికి ఉపాసన గ్రాండ్ పార్టీ ఇచ్చి తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఓ పక్క హాస్పిటల్ వ్యవహారాలు మరోవైపు సామాజిక సేవ తరువాత కుటుంబం ఇన్ని బాధ్యతల నడుమ ఆమె బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. రాంచరణ్, ఉపాసనల పెళ్లి జరిగి పదేళ్లవుతోంది. ఇంకా పిల్లలు లేరు. దీంతో అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది.

బిజీ షెడ్యూల్ లో పిల్లల గురించి మరిచిపోయినట్లే అనిపిస్తోంది. పలు సందర్భాల్లో తనకు బరువైన బాధ్యతలుండటం వల్లే తాను ఇంకా పిల్లల గురించి ఆలోచించడం లేదని ఉపాసన చెప్పడం గమనార్హం. దీంతో మెగా అభిమానులకు ఆసక్తి కలుగుతున్నా వారు మాత్రం ఇంకా ప్లాన్ చేయట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాంచరణ్, ఉపాసన లకు సంతానం కలిగితే తమకు కూడా పండగే అనే విషయాన్ని అభిమానులు సైతం తెస్తున్నారు. కానీ వారిలో మాత్రం ఆ ఆలోచన ఇంకా కార్యరూపం దాల్చడం లేదని సమాచారం.
Also Read: Dil Raju- Ram Pothineni: అల్లు అర్జున్ తో చెయ్యాల్సిన సినిమా హీరో రామ్ తో చెయ్యబోతున్న దిల్ రాజు

ఈ సందర్భంగా రాంచరణ్ తన కుటుంబం ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీంతో అభిమానులు సందడి చేశారు. ఈ ఫొటో వైరల్ అవుతోంది. చిరంజీవి కుటుంబంలో నలుగురు కలిసి ఉన్న ఫొటోతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఉపాసన జులై 20, 1989లో జన్మించింది. తల్లిదండ్రులు అనిల్ కామినేని, శోభన కామినేని. దీంతో ఉపాసన అపోలో ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖులతో ఇంటర్వ్యూలు, సలహాలు, సమాధానాలు చెబుతున్నారు.
Also Read:Rakul Preet Singh: ఆ హీరో కోసం కెరీర్ ని చేతులారా నాశనం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్