Homeఎంటర్టైన్మెంట్Brigida Saga: అతని కోసమే నగ్నంగా నటించా.. బ్రిగిడి ఆసక్తికర వ్యాఖ్యలు

Brigida Saga: అతని కోసమే నగ్నంగా నటించా.. బ్రిగిడి ఆసక్తికర వ్యాఖ్యలు

Brigida Saga: అభిమానం ఉండాలి. చేసిన సాయానికి ఎంతో కొంత మనం కూడా తిరిగి సాయం చేస్తేనే ఎదుటివారికి మంచిగనిపిస్తుంది. నేన చేసిన దానికి ప్రతిఫలంగా ఎంతో కొంత చేశారని సర్దిచెప్పుకుంటారు. కానీ అభిమానం వెర్రితలలు వేస్తే కష్టమే. ఏదో మనకు ఆపన్నహస్తం అందించారని తాహత్తుకు మించిన పని చేయడం తగదు. ఇక్కడే అదే జరిగింది. తనకు సాయం చేశారనే ఉద్దేశంతో ఆయన కోసం చేయకూడని పని చేసింది. ఎక్కడా చెప్పుకోలేని విధంగా ప్రవర్తించడంతో అందరు ఆశ్చర్యపోయారు. తనకు జీవితాన్నిచ్చిన గాడ్ ఫాదర్ కు ఇంతలా మోకరిల్లాలా అనే సందేహాలు కూడా వస్తున్నాయి.

Brigida Saga
Brigida Saga

కోలీవుడ్ నటుడు, దర్శకుడు పార్తిబన్ నటించి దర్శకత్వం వహించిన సినిమా ఇరవన్ నిళల్. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, రోబో శంకర్, ప్రియాంక రుత్, బ్రిగిడి సాగా, ఆనంద్ కృష్ణన్ తదితరులు నటించారు. జులై 15న విడుదలైంది. ఇందులో చిలకమ్మ పాత్రలో బ్రిగిడ సాగా అనే అమ్మాయి నటించింది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో నగ్నంగా నటించాల్సి ఉంది. దీనికి ఆమె అంగీకరించింది. సహాయ దర్శకురాలిగా ఉన్న తనను హీరోయిన్ గా చేసిన పార్తిబన్ రుణం ఇలా తీర్చుకున్నానని చెప్పడం గమనార్హం.

Also Read: Dil Raju- Ram Pothineni: అల్లు అర్జున్ తో చెయ్యాల్సిన సినిమా హీరో రామ్ తో చెయ్యబోతున్న దిల్ రాజు

దీని కోసం ఆమె తల్లిదండ్రులను కూడా ఒప్పించింది. మొదట వారు నిరాకరించినా తరువాత దర్శకుడు వివరించి చెప్పడంతో వారు కూడా శాంతించారు. దీంతో ఆ సినిమాలో ఆమె నగ్నంగా నటించి అందరిని మెప్పించింది. తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడి కోసం తన శరీరాన్ని లెక్క చేయకుండా నటించడం మామూలు విషయం కాదు. దానికి చాలా సహనం కావాలి. భవిష్యత్ లో వచ్చే ఇబ్బందులను లెక్కలోకి తీసుకోకుండా ఆమె తన గురువు కోసం అంతటి త్యాగం చేయడం చర్చనీయాంశంగా మారింది.

Brigida Saga
Brigida Saga

కేవలం దర్శకుడి కోసమే ఈ సీన్ లో ఒప్పుకున్నానని చెప్పింది. తన బతుకుకు ఆధారం చూపిన దేవుడి రుణం తీర్చుకున్నానని సంబరపడిపోతోంది. న్యూడ్ పాత్రలో నటించినా తనకేమీ నష్టం లేదని చెబుతోంది. భవిష్యత్ లో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని సూచిస్తోంది. సాయం చేస్తే ఏదో మనం మనం ప్రతిసాయం చేయాలే కానీ ఇలా నగ్నంగా నటించి రుణం తీర్చుకోవడంపై అందరిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బ్రిగిడి చేసిన పనికి యావత్ సినీ ప్రపంచమే నివ్వెరపోతోంది.

Also Read:Samantha: మరోసారి విలన్ పాత్రలో కనిపించబోతున్న సమంత..షాక్ లో ఫాన్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version