Ram Charan- Shankar: ‘చరణ్ – శంకర్’ సినిమా టైటిల్ ఫిక్స్.. హాలీవుడ్ టెక్నీషియన్స్ వచ్చేశారు

Ram Charan- Shankar: విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమా టైటిల్‌ విష‌యంలో చాలా రోజుల నుంచి చాలా రూమర్లు వినిపిస్తున్నాయి. ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. మొదట్లో ఈ సినిమా టైటిల్ ‘విశ్వంభ‌ర‌’ అన్నారు, ఆ తర్వాత అది కాదు.. ‘స‌ర్కారోడు’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారు అన్నారు. లేదు లేదు.. ‘అధికారి’ అనే టైటిల్ శంకర్ కి బాగా నచ్చింది, […]

Written By: Shiva, Updated On : July 8, 2022 10:36 am

Ram Charan- Shankar

Follow us on

Ram Charan- Shankar: విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమా టైటిల్‌ విష‌యంలో చాలా రోజుల నుంచి చాలా రూమర్లు వినిపిస్తున్నాయి. ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. మొదట్లో ఈ సినిమా టైటిల్ ‘విశ్వంభ‌ర‌’ అన్నారు, ఆ తర్వాత అది కాదు.. ‘స‌ర్కారోడు’ అనే టైటిల్ ను ఫైనల్ చేశారు అన్నారు. లేదు లేదు.. ‘అధికారి’ అనే టైటిల్ శంకర్ కి బాగా నచ్చింది, కాబట్టి.. చరణ్ సినిమాకి ఈ టైటిల్ నే ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు.

Ram Charan- Shankar

ఇందులో ఏది నిజం ?, అసలు దర్శకుడు శంకర్ మదిలో ఉన్న టైటిల్ ఏమిటి ?. మరి శంకర్ ఏ టైటిల్ పెట్ట‌బోతున్నారో తెలుసా ?, ‘అధికారి’. ఈ టైటిల్‌ తన కథకు పర్ఫెక్ట్ గా సరిపోయిందని శంకర్ ఫీల్ అవుతున్నారు. ఇక మిగిలిన టైటిల్స్ అన్నీ ఫేకే. అన్నట్టు ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ డ్యూయెల్ రోల్ చేయ‌బోతున్నారు. అయితే.. సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో ఒక పాత్రకు ‘అధికారి’ అని పేరు ఉంటుందట. ప్లాష్ బ్యాక్ లో ఈ పాత్ర వస్తోందట.

Also Read: NTR Apologized Star Heroine: ప్రముఖ స్టార్ హీరోయిన్ కి క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్.. కారణం ఏంటో తెలుసా?

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గ్యాప్ లేకుండా జరుగుతుంది. శంక‌ర్ అంటేనే గ్రాండియ‌ర్‌. అందుకే.. ఈ సినిమా షూటింగ్ కూడా ఆ స్థాయిలోనే జరుగుతుంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌ పని చేయబోతున్నారు. లార్డ్ ఆఫ్ రింగ్స్‌, ది విచ్చేర్‌, ది హాబిట్ సినిమాల‌కు వ‌ర్క్ చేసిన మేక‌ప్ టీమ్ వేటా వ‌ర్క్ షాప్ ఈ సినిమాకు కూడా వర్క్ చేయబోతున్నారు.

Ram Charan- Shankar

అయితే, వీరు కేవలం రామ్‌ చరణ్ పాత్ర కోసం పని చేయనున్నారు. చరణ్ ను చాలా కొత్తగా చూపించడానికి వీళ్లు లేటెస్ట్ పరికరాలను కూడా ఉపయోగిస్తున్నారు. రామ్‌ చరణ్‌ రాజకీయ నేతగా కనిపించనున్నాడు. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్. అయితే, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. ఎలాగూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శంకర్ సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తాడు. కాబట్టి.. ఈ సినిమాతో తన ఆశను తీర్చుకుంటాడేమో చూడాలి.

Also Read:Aishwarya Rai: ప్రతీకారానికి అందమైన రూపమే ఐశ్వర్య రాయ్

Tags