NTR Apologized Star Heroine: టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈయన సినిమా వచ్చిందంటే చాలు తెలుగు తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోతాయి..ఇప్పుడు ఆయన రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపుని తెచుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ పరకాయప్రవేశం చేసి అన్ని బాషల సినీ ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నాడు..ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి సినిమాకి ఉన్న ప్రత్యేకత ఎలాంటిదో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా ద్వారా ఆయన మాస్ లో ఎవ్వరు అందుకొని స్థాయికి వెళ్ళిపోయాడు..స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తర్వాత ఎన్టీఆర్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇది..అయితే ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక ప్రత్యేకమైన సాంగ్ లో డాన్స్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సాంగ్ అప్పట్లో మాస్ లో ఒక ఊపు ఒప్పేసింది..అయితే ఈ పాట చేసే సమయం లో ఎన్టీఆర్ రమ్యకృష్ణ విషయం లో చాలా బాధపడ్డాడట.
Also Read: Senior Heroine Trisha: ఆమె మాకొద్దు మహాప్రభో… అయినా చేస్తానంటుంది
ఇక అసలు విషయానికి వస్తే హీరోయిన్ రమ్య కృష్ణ వయస్సు లో కానీ..అనుభవం లో కానీ జూనియర్ ఎన్టీఆర్ కంటే ఎంతో పెద్ద..కానీ ఆ పాట కంటెంట్ ప్రకారం ఎన్టీఆర్ ఆమెని చాలా సార్లు ముట్టుకోవాల్సి ఉంటుంది..దీనికి ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడట..తాను నాకంటే చాలా పెద్ద మరియు సీనియర్..ఆమెని అలా అన్ని సార్లు ముట్టుకున్నాను..ఏమనుకుందో ఏమో అని బాధపడి ఎన్టీఆర్ ఆమె వద్దకి వెళ్లి ‘నేను ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటె క్షమించండి’ అంటూ ఆమెని అడిగాడట..దానికి రమ్యకృష్ణ ఒక నవ్వు నవ్వి ‘నేను అసలు ఏమి ఫీల్ కాదు..నువ్వు ఏదేదో ఊహించుకోకు..ఇంకా చెప్పాలంటే నువ్వు డాన్స్ అద్భుతంగా వెయ్యడం వల్ల..నిన్ను చూసి మరింత రెట్టింపు ఉత్సాహం తో నేను కూడా చేయగలిగాను..అందుకే సాంగ్ ఔట్పుట్ అద్భుతంగా వచ్చింది’ అని చెప్పిందట..ఈ విషయం చాలా కాలం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా లో బయటపడి తెగ వైరల్ గా మారిపోయింది..ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే #RRR తర్వాత ఆయన కొరటాల శివ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమా తర్వాత ఆయన KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరో సినిమా కూడా చేయనున్నాడు..ఇంకా షూటింగ్స్ కూడా స్టార్ట్ కాకపోయినప్పటికీ కూడా అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..మరి ఆ అంచనాలను ఈ రెండు సినిమాలు అందుకుంటుందో లేదో తెలియాలి అంటే వచ్చే ఏడాది వరుకు ఆగాల్సిందే.
Also Read: Aishwarya Rai: ప్రతీకారానికి అందమైన రూపమే ఐశ్వర్య రాయ్