Ram Charan: వారసత్వం ఉన్నంత మాత్రానా ఇండస్ట్రీ లో సక్సెస్ కాలేరు, ఎంత పెద్ద సూపర్ స్టార్ కొడుకైనా, కూతురైనా టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీ లో సక్సెస్ కాగలరు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ని, అలాగే అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ని తీసుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ కాలేకపోయాడు, కానీ చిరంజీవి కొడుకు చిరంజీవిని మించిన సూపర్ స్టార్ అయ్యాడు. టాలెంట్ ఉంటే అది పరిస్థితి. ఇది ఇలా ఉండగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. రజినీకాంత్ ఇద్దరు కూతుర్లు కూడా ఇండస్ట్రీ లో డైరెక్టర్స్ అయ్యారు. వారిలో ఐశ్వర్య రజినీకాంత్ తమిళం లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం కూడా వహించింది. కానీ ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా రాలేదు. రీసెంట్ గా ఆమె రజినీకాంత్ ని ప్రధాన పాత్రలో పెట్టి లాల్ సలాం అనే చిత్రం తెరకెక్కించింది.
ఈ చిత్రం రజినీకాంత్ 5 దశాబ్దాల సినీ కెరీర్ లో ఎన్నడూ చూడని రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఆమె డైరెక్షన్ చెయ్యాలనే ఆలోచన విరమించుకున్నట్టు లేటెస్ట్ గా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రజినీకాంత్ తనకి ఉన్న పలుకుబడితో ఇండస్ట్రీ లో తన కూతురుకి అవకాశాలు రప్పించగలిగాడు కానీ, స్టార్ డైరెక్టర్ ని మాత్రం చేయలేకపోయాడు. టాలెంట్ ఉన్న వారసులకు , టాలెంట్ లేని వారసులకు వ్యత్యాసం ఇదే. ఇది ఇలా ఉండగా మూడేళ్ళ క్రితం ఐశ్వర్య రజినీకాంత్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేసేందుకు అతని వద్దకు వచ్చింది. ఇది ఒక ట్రాజెడీ స్టోరీ అట, హీరో క్లైమాక్స్ లో చనిపోతాడట. ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవ్వవు, వేరే ప్రాజెక్ట్ చేద్దాం, ఇది వద్దు అని ఐశ్వర్య తో అన్నాడట. క్లైమాక్స్ మారుద్దాం అని చెప్పినా కూడా రామ్ చరణ్ వర్కౌట్ అవ్వదు, వద్దు అని చెప్పాడట.
ఆ తర్వాత వేరే సబ్జెక్టు తో ఐశ్వర్య రజినీకాంత్ రామ్ చరణ్ వద్దకు రాలేదు, రామ్ చరణ్ కూడా ఆమెని మళ్ళీ పిలవలేదు. అలా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ వరకు వచ్చి ఆగిపోయిందని టాక్. మూడు సంవత్సరాల క్రితం ఇది జరిగింది అంటే, #RRR చిత్రానికి ముందు. #RRR కి ముందు రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలాంటి ఫ్లాప్ సినిమా చేసే బదులు, ఐశ్వర్య రజినీకాంత్ చెప్పిన స్టోరీ తో సినిమా చేసి ఉండొచ్చు కదా, కమర్షియల్ గా వర్కౌట్ అవ్వుదో లేదో పక్కన పెడితే ఒక అవకాశం ఇచ్చి చూడాల్సింది అని రజినీకాంత్ అభిమానులు సోషల్ మీడియా లో అంటున్నారు.