https://oktelugu.com/

Chiranjeevi: లెక్కకు మించిన హీరోయిన్స్ తో నటించిన చిరంజీవికి నచ్చిన ఒకే ఒక హీరోయిన్, ఆమె ఎవరు? ఎందుకు?

చిరంజీవి సుదీర్ఘ ప్రస్థానంలో అనేక మైలురాళ్ళు చేరుకున్నారు. పదుల సంఖ్యలో హీరోయిన్స్ తో ఆయన నటించారు. స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆయనతో కలిసి జతకట్టిన ఒక హీరోయిన్ మాత్రం చిరంజీవి ఆల్ టైం ఫేవరేట్ అట. అందుకు కారణం కూడా ఓ సందర్భంలో ఆయన వివరించారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 13, 2024 / 03:24 PM IST

    Chiranjeevi(6)

    Follow us on

    Chiranjeevi: గాడ్ ఫాదర్ లేకుండా టాలీవుడ్ కింగ్ గా ఎదిగాడు చిరంజీవి. 1978లో విడుదలైన ప్రాణం ఖరీదు చిత్రంతో చిరంజీవి వెండితెరకు పరిచయం అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో అన్ని రకాల పాత్రలు చేశాడు. సపోర్టింగ్ రోల్స్ తో పాటు విలన్ గా సైతం కనిపించాడు. ఒక్కో సినిమాకు తనను తాను మెరుగు పరచుకుంటూ చిరంజీవి నెంబర్ హీరో పొజిషన్ కైవసం చేసుకున్నాడు. జయసుధ నుండి కాజల్ వరకు చిరంజీవి నాలుగు తరాల హీరోయిన్స్ తో నటించాడు.

    చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ లిస్ట్ చాలా పెద్దది. 80-90లలో హీరోలు ఏడాదికి పదికి పైగా సినిమాలు చేసేవారు. ఈ క్రమంలో హీరో-హీరోయిన్ కాంబినేషన్స్ రిపీట్ అవుతూ ఉండేవి. రాధ, రాధిక, శ్రీదేవి, సుహాసిని, విజయశాంతి వంటి హీరోయిన్స్ తో చిరంజీవి ఎక్కువ సినిమాలు చేశారు. జనరేషన్స్ పక్కన పెట్టి చిరంజీవికి తనతో జతకట్టిన హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం?

    Chiranjeevi(7)

    ఈ ప్రశ్న చిరంజీవికి పలుమార్లు ఎదురైంది. ఓ సందర్భంలో ఆయన వివరంగా చెప్పుకొచ్చాడు. తన ఆల్ టైం ఫేవరేట్ హీరోయిన్ ఎవరో వెల్లడించారు. చిరంజీవి మాట్లాడుతూ… ఒక్కో హీరోయిన్ లో ఒక్కో గొప్ప క్వాలిటీ ఉంటుంది. రాధ మంచి డాన్సర్, శ్రీదేవి ఓవరాల్ గా ఉన్నతమైన పర్సనాలిటీ(వ్యక్తిత్వం). ఇక సుమలత గురించి చెప్పాలంటే హోమ్లీ రోల్స్ కి పెట్టింది పేరు. సుహాసిని లో మరో మంచి క్వాలిటీ ఉంది.

    ఇలా ఒక్కొక్కరిలో ఉన్న ఒక క్వాలిటీ నాకు ఇష్టం. అందుకు వారికి నేను దాసోహం అంటాను. మహానటి సావిత్రి.. ఆమె తర్వాత జయసుధ, వాణిశ్రీ గొప్ప హీరోయిన్స్. వారి తర్వాత విలక్షణమైన హీరోయిన్ అంటే రాధికనే. రాధిక ఎమోషన్స్ పండించగలదు. కామెడీ చేయగలదు. మాస్, క్లాస్ ఏదైనా చేస్తుంది. వైవిధ్యం చూపించగల నటి. అందుకే నాకు రాధిక అంటే చాలా ఇష్టం, అన్నారు.

    రాధిక-చిరంజీవి కాంబోలో పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కెరీర్ దాదాపు ఒకే సమయంలో మొదలైంది. దొంగ మొగుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, న్యాయం కావాలి, అభిలాష, యమకింకరుడు, పులి బెబ్బులి, శివుడు శివుడు శివుడు చిత్రాలు మచ్చుకకు కొన్ని మాత్రమే. అదన్నమాట సంగతి.

    ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వశిష్ట ఈ చిత్ర దర్శకుడు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కానుంది. త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.